Blood Pressure Rise : రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? రక్తపోటు పెరిగిందని తెలుసుకోవటం ఎలా?

సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలను అధికంగా తినటం రక్తపోటుకు దారి తీస్తుంది. ముఖ్యంగా ప్రానెస్‌ ఫుడ్‌, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్‌ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో హైపర్ టెన్షన్ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఆల్కాహాల్‌ మోతాదుకు మించితే బీపీ పెరిగే అవకాశాలూ ఉన్నాయి.

Blood Pressure Rise : రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? రక్తపోటు పెరిగిందని తెలుసుకోవటం ఎలా?

blood pressure rise

Blood Pressure Rise : హైపర్‌టెన్షన్‌ బారినపడే వారి నంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మందికి అసలు తమకు రక్తపోటు ఉన్న విషయమే తెలియదు. ఏదో ఒక అనారోగ్య సమస్యతో వైద్యుని వద్దకు వెళ్లిన సందర్భంలో తమకు రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సాధారణ సమస్యగా చూడకుండా తీవ్రస్ధాయికి చేరకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నారు. మరికొందరు వంశపారంపర్యంగా రక్తపోటు వస్తోంది.

సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలను అధికంగా తినటం రక్తపోటుకు దారి తీస్తుంది. ముఖ్యంగా ప్రానెస్‌ ఫుడ్‌, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్‌ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో హైపర్ టెన్షన్ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఆల్కాహాల్‌ మోతాదుకు మించితే బీపీ పెరిగే అవకాశాలూ ఉన్నాయి. అలాగే ఇటీవలి కాలంలో ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

రక్తపోటు అంటే ;

శరీర అవయవాలకు గుండె ధమనుల ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ రక్త ప్రవాహం ధమనులపై ఏర్పరిచే ప్రెజర్‌ను రక్తపోటు అంటారు. ధమనులు ఆరోగ్యంగా ఉంటే రక్తం సులభంగా ప్రవహిస్తుంది. గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయితే  ధమనులు  ఇరుకుగా మారి, కుంచించుకు పోయినప్పుడు, గట్టిపడినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీంతో రక్తాన్ని పంపింగ్ చేసేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ పరిణామాల వల్ల ధమనులు దెబ్బతింటాయి.

రక్తపోటు కారణంగా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినటం, బలహీనపడటం చోటు చేసుకుంటాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం, చిట్లిపోయి ఫలితంగా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. గుండె కండరానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు రావొచ్చు. మూత్రపిండాల రక్తనాళాలు దెబ్బతినటం వల్ల రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం, మైకం, అలసట, మూర్చపోవటం, ఏకాగ్రత కోల్పోవటం వంటివి చవిచూడాల్సి వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవటం మంచిది.

హై బీపీ ఉన్నవారు కూడా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రోజు కనీసం 15 నిముషాలు మెడిటేషన్ చేస్తే బీపీ వల్ల కలిగే హైపెర్టెన్షన్స్ అన్ని పోతాయి. అలాగే ఎక్సర్సైజు చేయడం వలన బాడీ ఫిట్ గా ఉండటమే కాకుండా బరువు తగ్గటం లో ను, బీపీ తగ్గటంలోను దోహదపడుతుంది.