Calcium : శరీరానికి కాల్షియం ఎందుకు కావాలంటే?

కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవటం కంటే ఆహారం రూపంలో తీసుకోవడం మంచిది. రోజుకు 500 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకండి. అతిగా కాల్షియం తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

Calcium : శరీరానికి కాల్షియం ఎందుకు కావాలంటే?

Body Need Calcium

Calcium : మనం తీసుకునే ఆహారం శరీరం సమర్థవంతగా పనిచేసేందుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్ల వంటి వివిధ రకాల పోషకాలు మన శరీరాన్ని, శారీరక అవయవాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. తినే ఆహారంలో ఉన్న వివిధ రకాల పోషకాలలో కాల్షియం అనేది చాలా ప్రయోజనకారిగా చెప్పవచ్చు. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం. యాంటాసిడ్లను, రక్తంలో మెగ్నీషియం, భాస్వరం , పొటాషియం వంటి వాటిని అధికమోతాదులను నియంత్రించడానికి కాల్షియం ఉపయోగించబడుతుంది. ఎముక ఆరోగ్యానికే కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త ఎముకలను పెరిగేలాచేసేందుకు, ఎముక బలాన్ని ఇచ్చేందుకు ఈ ఖనిజ కీలకం. గుండె, కండరాలు, నరాల యొక్క సరైన పనితీరుకు, రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహించటానికి, దంతాలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో, దీని అవసరత ఉంది.

రోజువారి ఆహారంలో సరైన స్థాయిలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం అవసరం. ఆహారంలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకల పెరుగుదల ఆరోగ్యకరంగా ఉండదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించడానికి దోహదపడుతుంది. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

కాల్షియం లోపతో బాధపడుతున్న రుతుక్రమం ఆగిపోయిన మహిళలు,లాక్టోస్ అసహనం ఉన్నవారు హృదయ స్పందన సరిగాలేకపోవటం, కండరాల తిమ్మిరి, మూర్ఛలు , చేతుల్లో, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలను కలిగిఉంటారు. కాల్షియం మాదిరిగానే ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో,మెరుగుపరచడంలో విటమిన్ డి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కాల్షియం గ్రహించడానికి విటమిన్ డి అవసరం. తగినంత విటమిన్ డి లేకపోవడం వల్ల ఆహారం నుండి తగినంత కాల్షియం గ్రహించటం సాధ్యకాదు. విటమిన్ డిని చర్మం ద్వారా సూర్యరశ్మి నుండి, ఆహారం, సప్లిమెంట్స్ ద్వారా పొందవచ్చు. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు గుడ్డు సొనలు, ఉప్పునీటి చేపలు, నారింజ రసం, సోయా పాలు, తృణధాన్యాలు, కాలేయం మరియు బలవర్థకమైన పాలు వంటివి తీసుకోవాలి. వీటిని తీసుకోవటం వల్ల ఆహారం నుండి కాల్షియం శోషణను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.

కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవటం కంటే ఆహారం రూపంలో తీసుకోవడం మంచిది. రోజుకు 500 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకండి. అతిగా కాల్షియం తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీని వల్ల కొంతమందిలో కిడ్నీలో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో కాల్షియం అధికంగా ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, మలబద్ధకం, అలసట, తీవ్రమైన దాహం, వికారం, కడుపు నొప్పి, వాంతులు, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కాల్షియం ఎక్కువ, తక్కువగా ఉందో రక్తపరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.