Drink Milk : పాలు రాత్రి సమయంలోనే ఎందుకు తాగాలి?..

పాలు సంపూర్ణ ఆహారం. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఉదయం పాలు తాగిన తరువాత పగటిపూట భారీగా అనిపించవచ్చు

Drink Milk : పాలు రాత్రి సమయంలోనే ఎందుకు తాగాలి?..

Milk

Drink Milk : పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పాలలో చాలా పోషకాలు ఉంటాయి. పాలను అల్పాహారంలో చేర్చినట్లయితే ఇది అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పాలు ఎముకలను బలపరుస్తుంది. పాలల్లో క్యాల్షియం ఫాస్పెట్ , పొటాషియం ఫాస్పెట్ , సోడియం క్లోరైడ్ , పొటాషియం క్లోరైడ్ , ఐరన్ ఫాస్ఫెట్ , మాంగనీస్ ఫాస్పెట్ ఉంటాయి. విటమిన్లు A,B,C,D,E,Oలు ఉంటాయి. శరీరానికి అవసరమయిన ఎమినో ఆమ్లములు ఉన్నాయి. పాల ద్వారా ఐరన్ లభిస్తుంది. ఇవి రోజంతా చురుకుగా ఉండటానికి మీకు సహాయపడతాయి. అయితే పాలు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

పాలు నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేదం చెప్తోంది. పాలు త్వరగా జీర్ణం కావు. అందుకే వాటిని ఉదయం పూట తాగడానికి తగినవి కాదని చెప్తారు. పాలు తాగడం పూర్తిగా మీ ఆరోగ్యం, మీ జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఆవుపాలు మాత్రం కచ్చితంగా రాత్రిపూట మాత్రమే తాగాలి. ఇన్సులిన్ సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే రాత్రిపూట పాలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు రాత్రి పూట పాలు తాగితే మీ ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది.

పాలు సంపూర్ణ ఆహారం. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఉదయం పాలు తాగిన తరువాత పగటిపూట భారీగా అనిపించవచ్చు. చాలా మందికి కడుపు నొప్పి, అజీర్ణం కూడా రావొచ్చు. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే రాత్రంతా మీ కడుపు నిండి ఉంటుంది. మీకు ఆకలి అనిపించదు. కనుక మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట వేడి పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది కండరాలను శాంత పరుస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.

రాత్రి సమయాల్లో వేడివేడి గోధుమ చపాతీలు ఆకుకూరలతో గాని , తీపి పదార్థాలతోగాని , పంచదారతో గాని తీసుకోన్న అనంతరం వేడిచేసిన పాలలో పంచదార కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి అవసరము ఇది పెరగాలంటే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.