Global Infection Records : ప్రపంచ కరోనా వ్యాప్తి రికార్డులను దాటేసిన భారత్.. ఎందుకీ దారుణ పరిస్థితి?

ప్రపంచంలో కంటే అత్యంత వేగంగా కరోనావైరస్ భారతదేశంలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా తీవ్రత కారణంగా భారత్ ఆర్థికపరంగా, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Global Infection Records : ప్రపంచ కరోనా వ్యాప్తి రికార్డులను దాటేసిన భారత్.. ఎందుకీ దారుణ పరిస్థితి?

Why India Is Shattering Global Infection Records (1)

India Global Infection Records : ప్రపంచంలో కంటే అత్యంత వేగంగా కరోనావైరస్ భారతదేశంలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా తీవ్రత కారణంగా భారత్ ఆర్థికపరంగా, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా భారత్.. 1.4 బిలియన్ల మందితో కరోనా మహమ్మారిపై పోరాటంలో పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రతిరోజు 2.7 మిలియన్ వ్యాక్సిన్ డోసులను అందిస్తుండగా.. ఇప్పటికీ 10శాతం కంటే తక్కువ మంది మాత్రమే తొలి షాట్ అందుకున్నారు.

భారత్ మొత్తం మీద 15.9 మిలియన్ల కరోనా కేసులు నమోదు కాగా.. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. కరోనా మరణాలు కూడా 184,657గా నమోదయ్యాయి. దేశంలో రెండో వేవ్.. భారత వైద్యం, ఆరోగ్యం పరంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఆస్పత్రుల్లో పేషెంట్ల కంటే వైద్యుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. ఆక్సిజన్ సరఫరా కొరత మరింత అద్వాన్నంగా మారింది. ఐసీయూలన్నీ నిండిపోయాయి. అన్ని వెంటిలేటర్లు వాడేశారు. చివరికి కరోనా బాధిత మృతదేహాలను దహనం చేసేందుకు కూడా శ్మశానాల్లో ఖాళీ లేదంటే పరిస్థితి ఎంత అధ్వన్నంగా ఉందో అర్థమవుతుంది.

Covid Deaths

దేశంలో ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే? :
భారతదేశంలో గత ఏడాది సెప్టెంబర్ నాటికి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా తీవ్రత తగ్గిపోయిందిలే అనుకున్న తరుణంలో ఫిబ్రవరి మధ్యనాటికి ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. వరుసుగా 30 వారాల పాటు తగ్గిన కేసులు ఆకస్మాత్తుగా పెరిగిపోవడమే ఈ కోవిడ్ సంక్షోభానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయలను పునరుద్ధరించడంలో భారత్ విఫలమైందని అంటున్నారు. వ్యాక్సినేషన్ వేగవంతంగా నిర్వహించకపోవడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని చెబుతున్నారు.

Covid Cases

దేశంలో మతపరమైన పండుగ ఉత్సవాలు, ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలను నియంత్రించడంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, అదే కరోనా వైరస్ కేసుల తీవ్రతకు దారితీసిందని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. దేశవ్యాప్తంగా వైద్యపరమైన సదుపాయాల విషయంలో తగిన ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశంలో గత రెండు వారాలు వరుసగా ఏడోసారి రోజువారీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఏప్రిల్ 6 నుంచి లక్షమందికి 6.75 కొత్త కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 20 నాటికి అదే లక్షమందికి 18.04 కొత్త కేసులు పెరిగాయని నివేదిక వెల్లడించింది.

భారత వైద్య వ్యవస్థ ఎందుకిలా కుదేలైంది :
భారతదేశం తన స్థూల జాతీయోత్పత్తిలో కొంత భాగాన్ని మాత్రమే తన ఆరోగ్య వ్యవస్థపై ఖర్చు చేస్తుంది. ఇతరాది పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే తక్కువనే చెప్పాలి. గత ఏడాది కరోనా వైరస్ సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది భారత్. లక్షలాది మందికి భయంకరమైన కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఉన్న ఆసుపత్రులకు మరింత సామర్థ్యాన్ని జోడించడం లేదా వైరస్‌ తీవ్రతను గుర్తించడంలో విఫలమయ్యామనే చెప్పాలి. వైరస్ కేసులు తగ్గడంతో వైరస్ పోయిందిలే అధికారులు నిర్లక్ష్యం వహించడం కూడా మళ్లీ కరోనా కేసులు పెరగడానికి దారితీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Oxgen పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా విషయంలో ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు కొరతను ఎదుర్కొంటున్నాయి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రులను రేషన్ అమలు చేయాలని కోరే పరిస్థితి వచ్చింది. ఆక్సిజన్ డిమాండ్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ట్యాంకులను హాట్‌స్పాట్‌లకు తరలిస్తున్నారు. స్థానిక అవసరాలను తీర్చడానికి ఇతర రాష్ట్రాలు అడ్డుకున్నాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించాయి.

భారత్ ముందున్న ప్రధాన సవాల్ ఏంటి? :
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. తగినంత మందికి టీకాలు వేయాలి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూలిపోకుండా నిరోధించడానికి అనేక సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. భారత్ అతిపెద్ద ప్రధాన వ్యాక్సిన్ ఉత్పత్తిదారు కావడం.. దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరగడంతో వ్యాక్సిన్ ఎగుమతును నిలిపివేసింది. దేశ జనాభాకు అవసరమైనంతగా వ్యాక్సిన్ తయారీదారులు తగినంత వేగంగా టీకాలను ఉత్పత్తి చేయగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Covid India

కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి వ్యాక్సిన్ ఒకటే మార్గం. షాట్ల వేగం, లభ్యతపై ఆధారపడి ఉంటుందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు విధిగా లాక్ డౌన్ లు అమలు చేయవల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలం పాటు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యలను కొనసాగించడం చాలా కీలమైనదిగా సూచిస్తున్నారు. అప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్యపడుతుందని అంటున్నారు.