Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?

వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం ఉంది. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అత్తా,కోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం.

Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?

Ashadamas

Ashadam : తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల ఆషాడం. ఆషాడమాసం శుభకార్యాలకు మంచిది కాదని పండితులు చెబుతుంటారు. పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాకపోయినా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, నిర్వహించటం వంటివి చేయవచ్చు. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. ఆషాడ మాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూన్, జూలై మధ్యలో వస్తుంది.

ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశం, శంకు స్థాపన వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అలాగే ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్,తేలంగాణ కర్ణాటకలలో ఆషాడమాసం వచ్చిందంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట నుండి పుట్టింటికి పంపిస్తారు. కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. సరైన సమయం లో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా తినటానికి తిండిలేక బాధ పడవలసివస్తుంది. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళ కూడదు అనే నియమం విధించారు.

కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండాలన్న ఆచారం అమలవుతుంది. దీనికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించి భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టటం అచారంగా వస్తుంది. అనారోగ్య మాసం ఆషాడంగా చెప్తారు. వర్షాలు పడి కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది.

వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం ఉంది. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అత్తా,కోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం. కాని సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆషాడంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. ఆషాడమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు.