Low Energy Diet : తక్కువ ఎనర్జీ ఆహారంతో… షుగర్ రోగులు బరువు తగ్గొచ్చు…

కూరగాయలతో కూడిన ప్రోటీన్ కలిగిన బోజనం తీసుకోవటంతోపాటు, రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగడం కూడా చాలా అవసరం.

Low Energy Diet : తక్కువ ఎనర్జీ ఆహారంతో… షుగర్ రోగులు బరువు తగ్గొచ్చు…

Diet For Sugar

Low Energy Diet : టైప్ 2 డయాబెటిస్ రోగులలో బరువు పెరగటం పెద్ద సమస్యగా చెప్పవచ్చు. మధుమేహానికి చికిత్సల్లో భాగంగా ఇన్సులిన్ థెరపీ అనుసరిస్తారు. దీనివల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. శక్తిని గ్రహించటానికి గ్లూకోజ్ ను ఇన్సులిన్ గ్రహిస్తుంది. ఆ ప్రక్రియలోనే ఆహారం నుండి చక్కెరలను గ్రహించగా శరీరం దానిని కొవ్వుగా మారుస్తుంది. అలా పోగుబడిన కొవ్వు నిల్వలే బరువు పెరిగేందుకు దారితీస్తుంది.

డయాబెటిస్ తో బాధపడుతున్న రోగులు వారు తినే ఆహారంపై ఎక్కవ శ్రధ్దవహించాల్సిన అవసరం ఉంది. అధికంగా ఉన్న బరువును తగ్గించుకుని ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయాలి. తినే ఆహారం విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి జాగ్రత్తలు పాటించని పక్షంలో బరువు పెరగటం మరింత తీవ్రతరమౌతుంది.

ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు తక్కువ శక్తితో కూడిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ డయాబెటోలోజియా జర్నల్ లో ప్రచురించటబడిన అధ్యయనం ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న వారు బరువు తగ్గటానికి తక్కువ శక్తి కలిగిన ఆహారం తీసుకోవటం అత్యంత ప్రభావవంతమైనదిగా తేలినట్లు సూచించింది.

గ్లాస్గో విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైక్ లీన్ , డాక్టర్ చైటాంగ్ చురువాంగ్ సుక్ అతని సహచరులు నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలను గ్రహించారు. తక్కువ ఎనర్జీ కలిగిన ఆహారాలను షుగర్ వ్యాధి రోగులు తీసుకోవటం మంచిదని వారి పరిశీలనలో తేలింది. 12 వారాల పాటు డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గటానికి తక్కువ శక్తి కలిగిన ఆహారాన్ని , తక్కువ కొవ్వు కలిగిన అధిక కార్భోహైడ్రేట్ ఆహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉన్నట్లు పరిశోధకుల బృందం కనుగొంది.

ఒక వ్యక్తి రోజుకు 800 కిలో కేలరీలు కంటే తక్కువ తినే ఆహారాన్ని చాలా తక్కువ శక్తి ఆహారంగా చెప్పవచ్చు. ఈ డైట్ ప్రోగ్రామ్ సాధారణంగా 8-16 వారాల పాటు కొనసాగిస్తే, వారానికి 1.5-2.5 కిలోల బరువు తగ్గవచ్చు. టైప్ 2 మధుమేహం విషయంలో, ఈ ఆహారం దీర్ఘకాలిక గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చాలా తక్కువ ఎనర్జీ డైట్ రోజుకు మూడుపర్యాయాలు తీసుకుంటూ మధ్యమధ్యలో నీటిని తీసుకుంటుండాలి. కూరగాయలతో కూడిన ప్రోటీన్ కలిగిన బోజనం తీసుకోవటంతోపాటు, రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగడం కూడా చాలా అవసరం. ఈ తరహా ఆహారాన్ని తీసుకునే సమయంలో మలబద్ధకాన్ని నివారించడానికి సున్నితమైన వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. అల్పాహారం,ఆల్కహాల్ తీసుకోరాదు. దీనివల్ల శక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

తక్కువ ఎనర్జీ కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అలాంటి ఆహారాన్ని తీసుకునే ముందు, వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. వైద్య పరీక్షల తర్వాతే వైద్యుని సూచన మేరకే తక్కువ శక్తి కలిగిన డైట్ కొనసాగించాలి. స్వల్పకాలిక బరువు తగ్గించేందుకు తక్కువ శక్తినిచ్చే అహారం దోహదపడుతుంది. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకుంటే అలసట, మలబద్ధకం మరియు నోటి దుర్వాసన వంటి దుష్ప్రభావాలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది.