Betel Leafs : చర్మం, జుట్టు ఆరోగ్యానికి తమలపాకులతో!

తమలపాకుల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అరలీటరు నీళ్లలో గుప్పెడు తమలపాకులను వేసి బాగా మరిగించాలి. ఆతరువాత నీటిని వడకట్టి అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి.

Betel Leafs : చర్మం, జుట్టు ఆరోగ్యానికి తమలపాకులతో!

Betel Leafs

Betel Leafs : తాంబూలంగా సేవించే తమలపాకులతో చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. తమలపాకుల్లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మంపై మొటిమలను నివారిస్తాయి. రెండు మూడు తమలపాకులను తీసుకుని మెత్తగా చేయాలి. అందులో చిటికెడు పసుపు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు తగ్గటంతోపాటు చర్మం మృధువుగా ఉంటుంది.

తమలపాకుల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అరలీటరు నీళ్లలో గుప్పెడు తమలపాకులను వేసి బాగా మరిగించాలి. ఆతరువాత నీటిని వడకట్టి అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖానికి తేమ అందటంతోపాటు తాజా ఉంటుంది. కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది. స్నానం చేసే సమయంలో నీటిలో కొన్ని చుక్కుల తమలపాకుల నూనె కలుపుకోవాలి. దీంతోపాటు కర్పూరం అరగదీసి తమలపాకుల నూనెలో కలుపుకోవాలి. దూదిలో ముంచి ముఖాన్ని తుడవటం వల్ల చర్మం క్లీన్ అవుతుంది.

జుట్టురాలే సమస్యను తగ్గించటంలో తమలపాకులు బాగా ఉపకరిస్తాయి. జుట్టు రాలటాన్ని నివారిస్తాయి. నువ్వుల నూనెలో తమలపాకులు వేసి మరిగించాలి. గోరువెచ్చని ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని బాగా మర్ధన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.