Milk For Skin : చర్మ సౌందర్యానికి పాలతో!

ఎండవేడి కారణంగా వచ్చే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మ ఛాయను పెంచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

Milk For Skin : చర్మ సౌందర్యానికి పాలతో!

Milk For Skin : శరీరానికి పోషకాలను అందించటంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. రోజుకు ఒక గ్లాసు పాలు తాగటం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం, పాస్పరస్, విటమిన్ ఎ, డి వంటి వాటిని పొందవచ్చు. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కండరాల పఠిష్టతకు పాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పాలలో 95 శాతం నీటి పరిమాణం ఉంటుంది. కాబట్టి పాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ కాకుండా చూస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే పాలను అమృతంతో పోలుస్తారు.

ఇంతవరకు బాగానే ఉన్నా చర్మ సౌందర్యానికి సైతం పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దుమ్మూ, ధూళీ ప్రభావం పడినప్పుడు చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పాలను సహజ క్లెన్సర్‌లా ఉపయోగించవచ్చు. పాలు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రపరిచి బ్లాక్‌హెడ్స్‌ వంటి సమస్యల్ని అదుపులో ఉంచుతుంది. పచ్చి పాలను ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచాలి. తరువాత బయటకు తీసి దానికి చెంచా సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి చేతి వేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మపైన ఉన్న మురికి తొలగిపోతుంది.

ఎండవేడి కారణంగా వచ్చే టాన్‌, పిగ్మేంటేషన్‌ వంటి సమస్యలను పచ్చిపాలతో అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మ ఛాయను పెంచటంలో సహాయకారిగా పనిచేస్తుంది. పచ్చి పాలూ, తేనె మిశ్రమాన్నిరోజూ ఒంటికి రాసుకుని 20 నిమిషాల తరువాత స్నానం చేస్తే చర్మం మంచి రంగులోకి వస్తుంది. చర్మం పొడి బారితే దీనికి పచ్చి పాలు చక్కని పరిష్కారం చూపుతుంది. పచ్చి పాలల్లో రెండు చుక్కల బాదం నూనె వేసి, చర్మానికి పట్టించి 30 నిమిషాలపాటు వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మానికి తగినంత తేమ అంది, పొడిబారడం తగ్గుతుంది. స్నానం చేసే నీళ్లలో అరకప్పు పచ్చిపాలూ, చెంచా గులాబీ నీరూ, రెండు చెంచాల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. దీనితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. పచ్చి పాలల్లో గులాబీ రేకల ముద్దా, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజు విడిచి రోజు ఒంటికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.