Sleeping : రాత్రి నిద్రపోకుండా…కునుకు తీస్తున్నారా..

రాత్రి సమయంలో గాఢ నిద్రలోకి వెళినప్పుడు మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. శరీరంలోని కండరాలన్నీ పూర్తిస్ధాయిలో విశ్రాంతి పొందుతాయి. ఆసమయంలో గుండె కొట్టుకునే వేగంకూడా నెమ్మదిస్తుంది.

Sleeping : రాత్రి నిద్రపోకుండా…కునుకు తీస్తున్నారా..

Sleep

Sleeping : చాలా మంది రాత్రి సమయంలో పూర్తి స్ధాయిలో నిద్రిపోరు. అప్పడప్పుడు మెలుకోవటం…మళ్ళి కొద్ది సేపు నిద్రించటం.. ఇలా నిద్రపట్టీపట్టక కునికుపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్ధులు ఇలా చేస్తుంటారు. ముఖ్యమైన పని ఉన్నప్పుడు రాత్రిళ్లు నిద్రపోకుండా కునికిపాట్లు తీస్తూ చదువుతూ, ఆపీసు వర్కు చేస్తూ ఎక్కవ సేపు గడుపుతుంటారు. ఇలా కునుకు తీయటమన్నది రాత్రి నిద్రకు ఏమాత్రం సమానం కాదని మిచిగన్ స్టేట్ యూనివర్శిటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాత్రి సమయంలో గాఢ నిద్రలోకి వెళినప్పుడు మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. శరీరంలోని కండరాలన్నీ పూర్తిస్ధాయిలో విశ్రాంతి పొందుతాయి. ఆసమయంలో గుండె కొట్టుకునే వేగంకూడా నెమ్మదిస్తుంది. దీనినే స్లో వేవ్ స్లీప్ గా పిలుస్తారు. రాత్రి సమయంలో పూర్తి స్ధాయిలో నిద్రించటం మనిషి శరీరానికి చాలా ముఖ్యమైనది. అలా కాకుండా కునుకు తీస్తూ మధ్యమధ్యలో నిద్రలేస్తూ ఉండటం వల్ల మెదడుకు పూర్తిస్ధాయి విశ్రాంతి దొరకదు.

పలువురు విద్యార్ధులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. రాత్రి పూర్తిసమయం నిద్రించిన వారితో, రాత్రంతా కునుకు తీసిన విద్యార్ధులను సరిపోల్చినప్పుడు అనేక ఆసక్తికర విషయాలను పరిశోధనల్లో గమనించారు. రాత్రంతా నిద్రపోయిన వారు తరువాతి రోజు ఉదయం పాఠ్యాంశాలను ఏకాగ్రతతో వినగలిగినట్లు గుర్తించారు. రాత్రి కునుకులతో కాలం గడిపిన వారిలో చిరాకు, చురుకుదనం లేకపోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. అందుకే రాత్రి సమయంలో పూర్తినిద్ర వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని, కునికిపాట్లతో కూడిన నిద్ర ఏమాత్రం మంచిదికాదని పరిశోధనల్లో తేలింది.