Woman Skin: మహిళల చర్మం వయస్సును 30ఏళ్లు తగ్గించొచ్చట

వయస్సు రీత్యా చర్మంపై వచ్చే ముడతలను 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లొచ్చని ఓ రీసెర్చ్ వెల్లడించింది. కేమ్‌బ్రిడ్జ్ సైంటిస్టులు జరిపిన పరిశోధనలో పాల్గొన్న 53ఏళ్ల మహిళ చర్మంపై ముడతలను..

Woman Skin: మహిళల చర్మం వయస్సును 30ఏళ్లు తగ్గించొచ్చట

Skin Ageing

Woman Skin: వయస్సు రీత్యా చర్మంపై వచ్చే ముడతలను 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లొచ్చని ఓ రీసెర్చ్ వెల్లడించింది. కేమ్‌బ్రిడ్జ్ సైంటిస్టులు జరిపిన పరిశోధనలో పాల్గొన్న 53ఏళ్ల మహిళ చర్మంపై ముడతలను 30ఏళ్ల క్రితానికి తీసుకెళ్లారట. రివర్సల్ ఆఫ్ ఏజింగ్ క్లాక్ లో భాగంగా జరిగిందని, దీని వల్ల చర్మంపై కణాలకు ఎటువంటి డేమేజీ ఉండదని చెబుతున్నారు.

eLife మ్యాగజైన్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. శరీరంలోని ఇతర అవయవాలకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి వాటి వయస్సును తగ్గించొచ్చు. వీటివల్ల డయాబెటిస్, గుండెజబ్బులు, న్యూరలాజికల్ సమస్యలు వంటి వాటిని పరిష్కరించుకోవచ్చు.

“ఈ పని చాలా ఉత్తేజకరమైన సమస్యలను కలిగి ఉంది. చివరికి, పునరుత్పత్తి చేయకుండానే పునరుజ్జీవింపజేసే జన్యువులను గుర్తించగలం. శరీరంపై వృద్ధాప్యం ప్రభావాలను తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది” అని ఎపిజెనెటిక్స్ పరిశోధన కార్యక్రమంలో ఆ గ్రూప్ లీడర్ అయిన ప్రొఫెసర్ వోల్ఫ్ రీక్ స్కై మీడియా సమావేశంలో అన్నారు.

Read Also: చర్మంపై ముడతలు తగ్గాలంటే..

ఈ పరిశోధనల్లో యుక్త వయస్సులో ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తామని రీసెర్చ్ చెబుతుంది.

కణజాలం పనిచేయకపోవడం, వ్యాధికి దారితీసే సరైన పనితీరును కణాల సామర్థ్యంలో క్రమంగా క్షీణత, పునరుత్పత్తి, పాత కణాలను రిపేర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుని రీసెర్చ్ జరిపారు.

కేంబ్రిడ్జ్‌లోని బృందం మెచ్యూరేషన్ ఫేజ్ ట్రాన్సియెంట్ రీప్రోగ్రామింగ్ (MPTR) పద్ధతిని ఉపయోగించింది. ఇది సెల్ ఐడెంటిటీని చెరిపేసే సమస్యను అధిగమించి, కణాలను వాటి ప్రత్యేక సెల్ ఫంక్షన్‌ను నిలుపుకుంటూనే వాటిని యవ్వనంగా మార్చే సమతుల్యతను కనుగొనడానికి పరిశోధకులకు సహకరించింది.