Women Secret: మహిళలు ముఖం చూసి చెప్పగలరట.. స్టడీలో బయటపడ్డ ఘోరమైన నిజాలు

రీసెర్చర్లు తాము జరిపిన స్టడీలో మహిళల గురించి ఆశ్చర్యపోయే నిజాలు తెలుసుకున్నారు. ముఖాలను బట్టి ఓపెన్ లేదా క్యాజువల్ సెక్స్ కు ప్రియారిటీ ఇచ్చే వాళ్లను ఇట్టే కనుగొనగలరట.

Women Secret: మహిళలు ముఖం చూసి చెప్పగలరట.. స్టడీలో బయటపడ్డ ఘోరమైన నిజాలు

Womes Seeking (1)

Women Secret: రీసెర్చర్లు తాము జరిపిన స్టడీలో మహిళల గురించి ఆశ్చర్యపోయే నిజాలు తెలుసుకున్నారు. ముఖాలను బట్టి ఓపెన్ లేదా క్యాజువల్ సెక్స్ కు ప్రియారిటీ ఇచ్చే వాళ్లను ఇట్టే కనుగొనగలరట. ఎక్కువ మంది చెప్పిన దానిని బట్టి పొడవైన మొహం ఉన్న వాళ్లు, విశాలమైన నుదురు, పొడవాటి ముక్కు, పెద్ద కళ్లు ఉండే వాళ్లు క్యాజువల్ సెక్స్ కు రెడీగా ఉంటారని చెప్తున్నారు.

ఆస్ట్రేలియాలోని మక్క్వైరీ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ల టీం జరిపిన స్టడీలో మనుషులపై మెకానికల్ అట్రాక్షన్ గురించి ఓ డిబేట్‌ను ప్రస్తావించారు. సైకాలజీ ప్రకారం, మనుషులు హెల్తీగా, సమర్థవంతంగా కనిపించే వారినే ఎంచుకుంటారు. ఈ విషయంలో వారి ముఖం, శరీరం వారి గురించి తెలియజేస్తుందని అంటున్నారు.

వారి భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియలో భాగంగా కళ్లతో చూసే హాట్ గా ఉన్నారా లేదా అనే ఒపీనియన్ కు వచ్చేస్తారట. 103మంది మనుషులపై ఈ స్టడీని నిర్వహించారు. ఇందులో ఆడ, మగ ఇద్దరూ పాల్గొన్నారు. తాత్కాలికమైన రిలేషన్, క్యాజువల్ సెక్స్ గురించి రీసెర్చర్లు వారిని ప్రశ్నించారట. అందులో మగాళ్ల ముఖాన్ని బట్టే తాము ఎంచుకుంటామని చెప్పగా, మహిళల ముఖం బట్టి ఎంచుకుంటామని మగాళ్లు చెప్పలేదు.

ఇందులో భాగంగానే మహిళలు ఎంచుకున్న వారిని ప్రశ్నించగా అనుకున్నట్లుగానే.. ఆ పోలికలు ఉన్న వారు సోషియోసెక్సువాలిటీకి సిద్ధంగానే ఉన్నామని చెప్పారు.