Women Health : మహిళలు ఉద్యోగంతోపాటు ఆరోగ్యం విషయంలోనూ!

తక్కువ సమయంలో తయారు చేసుకోవటానికి వీలైన వాటిల్లో సూప్స్ కూడా ఒకటి. పోషకాలు అధికంగా కలిగిన వాటితో వివిధ రకాల సూప్ లను తయారు చేసుకుని వారానికి సరిపడా ఫ్రిజ్ లో ముందుగా నిల్వ చేసుకుని ఉంచుకోవచ్చు.

Women  Health : మహిళలు ఉద్యోగంతోపాటు ఆరోగ్యం విషయంలోనూ!

Working Women

Women Health : మహిళలు వంటింటికే పరమితమయ్యే రోజులు పోయాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఉద్యోగినులుగా తమ ప్రతిభను చాటు కుంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగినులు తమ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం శ్రద్ధ కనబరిచేందుకు తగిన సమయం కేటాయించటంలేదు. ఈ సందర్భంలోనే ఆరోగ్య సమస్యలు వారి చుట్టుముడుతున్నాయి. ఆహారంతోనే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందన్న విషయం ఉద్యోగినులుగా ఉన్న మహిళలు గుర్తుంచుకోవాలి. ఇందుకోసం రోజువారిగా బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం ద్వారా ఆనారోగ్యాలను దరి చేరకుండా చూసుకోవచ్చు.

ఉదయం సమయంలో ఆఫీసుకు సమయం మించి పోయిందంటూ బ్రేక్ పాస్ట్ ను మానేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. ఉదయం ఇడ్లీ, దోశ చేసుకునే సమయం లేకపోయినా, వాటిని తీసుకెళ్లటం కుదరకపోయినా, ముందు రోజు రాత్రి శనగలు, పెసలు, వేరుశనగపప్పులు, ఇతర గింజలను ఒక్కో స్పూను చొప్పున నానబెట్టుకోవాలి. తెల్లవారిన తరువాత వాటిని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, కొత్తిమీర , కొద్దిగా ఉప్ప జతచేసి దానికి కొంచెం నిమ్మరసం జత చేసి బ్యాక్స్ లో తీసుకుని వెళ్ళటం మంచిది. కార్యాలయం పనిచేస్తూనే వాటిని తినేయవచ్చు. ఈ తరహా బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.

తక్కువ సమయంలో తయారు చేసుకోవటానికి వీలైన వాటిల్లో సూప్స్ కూడా ఒకటి. పోషకాలు అధికంగా కలిగిన వాటితో వివిధ రకాల సూప్ లను తయారు చేసుకుని వారానికి సరిపడా ఫ్రిజ్ లో ముందుగా నిల్వ చేసుకుని ఉంచుకోవచ్చు. ప్రతిరోజు కొద్ది కొద్దిగా వేడి చేసుకుని లంచ్ సమయంలో ఆఫీసులో తీసుకోవచ్చు. ఉడికించిన, పచ్చి కూరగాయలను ఆఫీసుకు తీసుకువెళ్ళి మధ్యమధ్యలో వాటిని తీసుకోవచ్చు. వీటిని లంచ్ కు ముందు టీ సమయంలో తీసుకోవటం మంచిది. వీటితోపాటు కట్ చేసిన కొన్ని పండ్ల ముక్కలను బాక్స్ లో తీసుకువెళ్ళి తినవచ్చు. ఏ ఆహారాలు అందుబాటులో లేకుంటే కొన్ని బిస్కెట్లను దగ్గర ఉంచుకుని మధ్యమధ్యలో తీసుకోవటం మంచిది. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గకుండా చూసుకోవచ్చు.