రికార్డ్ సృష్టించిన బెంగళూరు…అక్రమసంబంధాలపై మహిళల ఆసక్తి

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2019 / 02:21 PM IST
రికార్డ్ సృష్టించిన బెంగళూరు…అక్రమసంబంధాలపై మహిళల ఆసక్తి

భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు భారతదేశపు ద్రోహపు రాజధానిగా మారిందని ఫ్రెంచ్‌కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్లీడన్ తెలిపింది.గ్లీడన్ నిర్వహించిన స్టడీ ప్రకారం…భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు స్టార్ట్ చేసిన వివాహేతర డేటింగ్ సైట్ లో 1.35లక్షల మంది బెంగుళూరియన్లు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు. ఇందులో 43,200మంది మహిళలు ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా వివాహేతర సంబధాలు కోరుకుంటున్నవారు ఉన్న నగరంగా బెంగళూరు రికార్డ్ సృష్టించినట్లు గ్లీడన్ కన్ఫర్మ్ చేసింది.

బెంగళూరు సిటీలోని వివాహితులైన 43,200మంది మహిళలు ఎగ్జైట్మెంట్,ఫ్రీడమ్ కోసం చూస్తున్నారని గ్లీడన్ చేసిన అధ్యయనంలో తేలింది. బెంగళూరుని భారతదేశపు ద్రోహపు రాజధానిగా పిలవడంలో తప్పులేదని గ్లీడన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ సొలినీ పైలట్ తెలిపారు.గ్లీడన్ సబ్ స్రైబర్స్  మొత్తంలో 27శాతం మంది యాక్టివ్ యూజర్లు బెంగళూరియన్లే ఉన్నారు.వీరిలో పురుష-మహిళల నిష్పత్తి 32%:68%గా ఉంది.

కుటుంబంతో బంధాలు బలపడటానికి వివాహేతర సంబంధం తనకు బాగా ఉపయోగపడిందని బెంగళూరుకి చెందిన 31 ఏళ్ల మహిళా యూజర్ తెలిపింది.వివాహేతర సంబంధానికి ముందు తనకు మోటివేషన్ కొరవడిందని ఆమె తెలిపింది.కుటుంతో పాటు వివాహేతర సంబంధం కూడా తనకు ముఖ్యమని ఆమె తెలిపింది.తన అభిప్రాయాలు,భావాలు షేర్ చేసుకునేందుకు తోడు దొరికినందుకు తనకు చాలా ఉందని ఆమె తెలిపింది. దేశంలో వివాహేతర సంబంధాలు అధికంగా కోరుకుంటున్న నగరాల్లో రెండవ ప్లేస్‌లో ముంబై, మూడో ప్లేస్‌లో కోల్‌కతా, నాల్గవ ప్లేస్‌లో ఢిల్లీ, ఐదో ప్లేస్ లో పూణే నిలిచాయని గ్లీడన్ తెలిపింది.