Yoga చేయ్యండి..ఒత్తిడికి దూరంగా ఉండండి

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 01:02 AM IST
Yoga చేయ్యండి..ఒత్తిడికి దూరంగా ఉండండి

ఉదయం లేచినప్పటి మొదలుకుని రాత్రి పడుకొనే వరకు ఏదో ఒక పనులతో బిజీ బిజీగా గడిపేస్తుంటారు. కొంతమంది అయితే..ఎప్పుడు తింటారో..ఎప్పుడు పడుకొంటారో వారికే తెలియదు. బిజీ బిజీ షెడ్యూల్ తో గడిపేస్తుంటారు. ఆధునిక జీవన విధానం, ఉరుకుల పరుగుల జీవితంతో గడిపేస్తుంటారు. ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో పని ఒత్తిడి, బాధ్యతల నిర్వహణ వంటివి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. 

కానీ దీనివల్ల చాలా మందికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీనికి యోగాయే ఒక్కటే పరిష్కారమని అంటున్నారు. రోజులో కొంత సమయం యోగాకు కేటాయిస్తే…ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు. యోగసనాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వార అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

ప్రతి రోజు యోగా చేయాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. యోగా చేయడం వల్ల..సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, పిల్లలు, యువకులు, వృద్ధులు.. ఇలా ప్రతి వారు చేయగలిగే ఆసనాలు ఎన్నో ఉన్నాయని, వాటిని సరైన విధంగా శిక్షకుల సహాయంతో చేస్తే..అనారోగ్యాల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు.

ప్రధానంగా ఓత్తిడి నుంచి బయటపడవచ్చని, కొన్ని ప్రత్యేక శ్వాస ప్రక్రియలు నేర్చుకుంటే..ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. అందులో ప్రధానమైంది..సూర్య నమస్కారాలు..వీటిని చేయడం వల్ల టెన్షన్, ఒత్తిడికి దూరంగా ఉండవచ్చంటున్నారు.

భద్రకోణాసన, భతమరి, విపరీత కరణి, శవాసన, యోగనిద్ర, మార్జరియాసన, కోనాసన, వీర్‌షోరాసన, త్రికోణాసన, భద్రకోణాసన, భతమరి ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం తదితర  ఆసనాలు  ఆరోగ్యాన్ని మెరుగపరుస్తాయని వెల్లడిస్తున్నారు…సో..ప్రతి నిత్యం యోగా చేయండి..టెన్షన్, ఒత్తిడిలకు దూరంగా ఉండండి.

Read: వయస్సు వేగం పెరుగుతోంది.. వృద్ధాప్య సమయానికి ఇదేనా సంకేతం?