Summer Super Food : వేసవి కాలంలో శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసే పెరుగు !
పెరుగు బరువును నియంత్రించడంలో సహాయపడే పదార్థం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నడుము చుట్టూ పెరుకుని ఉన్న కొవ్వులను సులభంగా తగ్గించుకోవచ్చు. పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. రోజూ పెరుగు తినడం వల్ల చర్మం అందంగా,తాజాగా కనిపిస్తుంది.

yogurt
Summer Super Food : వేసవి ఎండలు అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండవేడి, ఉక్కపోత ఇబ్బందులు కలిగిస్తుంది. ఎండవేడి కారణంగా శరీరమంతా వేడిగా మారిపోతుంది. ఈ సందర్భంలో శరీరాన్నిచల్లబరిచే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెరుగు వంటి వేసవి సమయంలో ఆహారంలో చేర్చుకోవటం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెరగాలంటే పెరుగును మనం రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు బాగా తగ్గి వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చు.
READ ALSO : Summer Sweat : వేసవిలో అధిక చెమట ఎందుకుపడుతుంది? అధిక చెమటలను ఆపాలంటే !
రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల రసాయనాలు, అనేక విషపదార్థాలు మన శరీర వ్యాధి నిరోధక శక్తి ఛిన్నా భిన్నం చేస్తుంటాయి. ఫలితంగా మన కణాలు తొందరగా క్షీణించి మనం వయసు పెరిగిన వారిగా కన్పిస్తుంటాం. అలాంటి సమయంలో పెరుగు మనకు ఒక సంజీవినిలా పనిచేస్తుందట.
బలపడనున్న ఎముకలు పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. వేసవి కారణంగా ఎముకలకు సంబంధించిన ఏదైనా సమస్య కలిగిఉంటే పెరుగు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా శక్తివంతంగా ఉండేందుకు పెరుగు బాగా దోహదం చేస్తుంది. పెరుగు రోజూ తీసుకోవడం చాలా మంచిది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్మ న శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి బ్యాక్టీరియోసిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది.
READ ALSO : Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !
పెరుగు బరువును నియంత్రించడంలో సహాయపడే పదార్థం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నడుము చుట్టూ పెరుకుని ఉన్న కొవ్వులను సులభంగా తగ్గించుకోవచ్చు. పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. రోజూ పెరుగు తినడం వల్ల చర్మం అందంగా,తాజాగా కనిపిస్తుంది.
అంతర్గత వేడి వల్ల చిరాకు, తలనొప్పి, ఉబ్బరం, అజీర్ణం, అలసట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గించటంలో పెరుగు వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
READ ALSO : Summer Drinks : వేసవి ఎండల కారణంగా ఎదురయ్యే డీహైడ్రేషన్ కు చెక్ పెట్టాలంటే ?
మెదడు పనితీరును మెరుగుపర్చటంతోపాటుగా ఒత్తిడి, టెన్షన్, ఆదుర్తా వంటివి పోగొట్టడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. పెరుగానే కాకుండా మజ్జిగ రూపంలో రెగ్యులర్ గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.