Weight : కోడి గుడ్డు తిన్నా బరువు తగ్గొచ్చు…

గుడ్డులో ఉండే పోషకాలు, ఇతర పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయని, దాంతో తక్కువ ఆహారం తింటారని అంటున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారని యూఎస్‌ యూనివర్శిటీ నిపుణులు నిర్థారించారు.

Weight : కోడి గుడ్డు తిన్నా బరువు తగ్గొచ్చు…

Eggs

Weight : పోషకాల భాండాగారంగా కోడి గుడ్డును చెప్పవచ్చు. కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పోషకాల గని గా పేరున్న గుడ్డులో ఎన్నో సుగుణాలున్నాయి. బరువు తగ్గేవాళ్లు దీనిని తింటే వారికి మంచి ఫలితాలు కనబడతాయి. బక్కగా ఉన్న వారికి, బలం తక్కువగా ఉన్న వారికి కోడి గుడ్లు తినమంటూ డాక్టర్లు సూచిస్తారు. ఉడకబెట్టిన కోడి గుడ్లను తినటం ఆరోగ్యానికి మంచిదని చెప్తారు.

అయితే, కోడి గుడ్లు తినడం వల్ల లావు అవుతారని అందరూ భావిస్తుంటారు. అందుకే అధిక బరువుకు భయపడి కోడిగుడ్లను మితంగా తింటుంటారు. కానీ, అధిక బరువు పెరుగుతారనే గుడ్డి నమ్మకాన్ని యూఎస్‌ కు చెందిన ఓ ప్రముఖ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తప్పని నిరూపించారు. బరువు తగ్గాలన్నా కూడా కోడి గుడ్డు తినాల్సిందేనని, ఇది మంచి ఔషదం చెబుతున్నారు. బరువును పెంచే కోడి గుడ్డును ఉపయోగించి.. బరువును ఈజీగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

అల్పాహారంలో.. ఉదయం పూట కోడిగుడ్డును తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు మీకు త్వరగా ఆకలి కాకుండా నిరోధిస్తాయి. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అధిక బరువు, ఉబకాయంతో బాధపడేవారు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి. రెగ్యులర్‌గా తినేదాని కన్నా కనీసం 50 శాతం తక్కువ తినాలి. అప్పుడే బరువు తగ్గే అవకాశం ఉంది. తక్కువ తిన్న సమయంలో ఆకలి లేకుండా ఉండేందుకు.. గుడ్డు తింటే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

గుడ్డులో ఉండే పోషకాలు, ఇతర పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయని, దాంతో తక్కువ ఆహారం తింటారని అంటున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారని యూఎస్‌ యూనివర్శిటీ నిపుణులు నిర్థారించారు. ఆహారం తక్కువ తీసుకున్న సమయంలో ఒక గుడ్డు తీసుకుంటే పర్వాలేదు. రోజులో ఎక్కువ కోడి గుడ్లు తీసుకుంటూ ఆహారం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకు బరువు పెరుగుతారని తెలిపారు.

వ్యాయామం చేసిన తర్వాత ఆకలి ఎక్కువగా వేస్తుంది. వ్యాయామం తర్వాత కండరాలకు శక్తి ఎంతో అవసరం. అందుకోసం గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి. బరువు తగ్గాలంటే గుడ్లను మితంగా తీసుకుని ఆహారం తగ్గించుకోవాలని సూచించారు. పరిమితంగా గుడ్లను తీసుకోవటం వల్ల మూడు వారాల్లో మీ బరువులో ఖచ్చితంగా తేడా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు.

ఇదిలా వుంటే నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ నిర్వహించిన మరో అధ్యయనంలో ఇదే ఫలితాలు వచ్చాయని తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు ఉదయం అల్పాహారంలో గుడ్డు తిన్న వారు , మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంలో ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించారని గుర్తించబడినది. ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల, బరువు తగ్గే ప్రమాణం సులభంగా పెరుగుతుంది. వాస్తవానికి, గుడ్డును అల్పాహారంగా తిన్న వారు వచ్చే ముప్పై ఆరు గంటలు అధిక కేలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించారని నిరూపితమైంది.