line clear for Amma rayjam lo Kadapa biddalu cinema

”అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమాకు లైన్ క్లియర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీ చేసింది. కొన్ని సీన్లను కట్ చేసి సినిమా విడుదల చేసుకోవచ్చని సూచించింది.

సినిమాలో అనేక అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, దాదాపుగా 90 సీన్లు అభ్యంతరం చెప్పే విధంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తే రిలీజ్ చేసేందుకు అనుమతి ఇస్తామని గతంలో సెన్సార్ బోర్డు చెప్పింది. సెన్సార్ బోర్డు చెప్పిన ఆ 90 సీన్లు కట్ చేస్తే.. సినిమాలో ఏమి ఉండదు. అలాంటప్పుడు రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం కంటే రిలీజ్ చేయకుండా ఉండటమే మంచిది. ఆ సమయంలోనే సినిమాను వర్మ యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. కానీ సడెన్ గా సెన్సార్ బోర్డు రివైజ్ కమిటీ సభ్యులు ఈ సినిమాని చూసి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా విడుదల తేదీని ఖరారు చేయడమే మిగిలింది. 

2019, డిసెంబర్ 12న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ తెలిపారు. ‘‘మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికీ ఉందని అర్థమైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది’’ అని ట్వీట్ చేశాడు. వెంటనే మరో ట్వీట్‌లో ‘‘సారీ సారీ సారీ.. అలవాటులో పొరపాటు.. నా ఉద్దేశ్యం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’’ అని వర్మ పేర్కొన్నాడు. 

తొలుత ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న టైటిల్ ను నిర్ణయించారు. సినిమా కథనంతోపాటు దీని టైటిల్ ను సవాల్ చేస్తూ..హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో సినిమా విడుదలకు హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు సినిమాను చూసి పరిశీలన అంశాలను తెలపాలని కోరిన విషయం తెలిసిందే. గతంలో సినిమాపై వివాదం నెలకొంది. ఈ సినిమా టైటిల్ గురించి, ఇతరత్రా రాజకీయ అంశాల గురించి చర్చలు జరగడం, కేసులు పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు రివైజింగ్ కమిటీ చిత్రాన్ని పూర్తిగా చూసి.. సెన్సార్ చేయాలనీ సూచించింది. 

READ  గృహనిర్బంధం నుంచి కశ్మీర్ నాయకులు విడుదల

నవంబర్ 29న సినిమా విడుదల పక్కా, ఒకవేళ సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’’ అని టైటిల్ మారుస్తానని ప్రకటించిన వర్మ.. ‘‘దండాలు’’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. ఇంతలో KRKR సినిమా విడుదల గురించి కోర్టు వర్మ ఊహించని తీర్పు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదని సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తెలుపగా.. వారం రోజుల్లో సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది.

సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని, రెండు కులాల మధ్య చిచ్చు రగిలించేలా ఉన్న టైటిల్‌ను మార్చాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు సూచించింది. అయితే ఇప్పటికే టైటిల్ మార్చామని, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ విడుదల వాయిదా పడింది.

గతంలో రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ నేనెవరిని టార్గెట్ చెయ్యలేదు ఉన్నవే చూపిస్తున్నాను.. కేఏ పాల్‌ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. ప్రస్తుతం ఆయన 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నారు. ఇలాంటివి ఆయన పట్టించుకోరు అనుకుంటున్నాను. నా సినిమాలో ఈ కులం కన్నా ఆ కులం, ఆ కులం కన్నా ఈ కులం పెద్దది అని నేను చెప్పడం లేదు. కొందరు అనుకుంటున్నట్టు, మీడియా వారు అడుగుతున్నట్టు నాకు ఎవరి దగ్గర్నుంచి బెదిరింపులు రాలేదు.

అసెంబ్లీలో మనుషులు అనుకున్నవి ప్రజలు చూస్తున్నప్పుడు సినిమాలో చూపిస్తే, యాక్టర్స్ చేస్తే తప్పేముంది. ఇంతకుముందు జరిగిన పరిణామలను సినిమాటిక్‌గా చెప్పాను కానీ ఈ సినిమాలో జరగనిది చూపిస్తున్నాము.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పాత్ర లేదు.. అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. మొత్తానికి తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో వర్మ ఖుషి చేసుకుంటున్నాడు.
 

Related Posts