Liquor Bottles In Food Packets At BJP  Temple Event In UP

గుడిలో రాజకీయం : పిల్లలకూ లిక్కర్ బాటిల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్‌ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో  జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హర్దోయ్‌లోని శ్రావణదేవి ఆలయంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానిక బీజేపీ పెద్దలు ఇరుకున పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌  : అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్‌ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హర్దోయ్‌లోని శ్రావణదేవి ఆలయంలో జరిగిన ఈ ఘటన స్థానిక బీజేపీ పెద్దలు ఇరుకున పడ్డారు.

ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్‌ తండ్రి నరేష్ అగర్వాల్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. పార్టీ మారిన తండ్రిని నేతలు..అనుచరులకు పరిచయం చేయటం కోసం ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. ‘పాసి సమ్మేళన్‌’ పేరుతో అమ్మవారి గుడిలో పొలిటికల్ మీటింగ్ పెట్టేశారు. వచ్చినోళ్లకు మంచీ మర్యాద చేయాలని కాబట్టి..  ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేశారు. అందులో పూరీలతోపాటు లిక్కర్ క్వార్టర్ బాటిల్స్ పెట్టారు. పెద్దలు ఎగిరి గంతులు వేస్తే.. పిల్లలు ఏంటీ బాటిల్స్ అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పిల్లలకు వచ్చిన లిక్కర్ బాటిళ్లను పెద్దలు తీసేసుకున్నారు. వాటి చేతిలో పూరీలు పెట్టి.. బాటిళ్లు మాత్రం ఎత్తుకెళ్లారు. పిల్లలకు లిక్కర్ బాటిల్స్ ఇవ్వటంతో.. మరింతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామంలోని తమ వర్గం వారికి ఈ ప్యాకెట్లను తప్పక పంపిణీ చేయాలని నితిన్‌ చెబుతున్నట్లున్న వీడియో ఒకటి బయటకు రావటంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనపై స్థానిక ఎంపీ అన్షుల్‌ వర్మ స్పందించారు. మద్యం పంపిణీ చేయడం ఏమిటంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు.

Related Posts