ఏం ఐడియాల్రా బాబూ : మల్లెపువ్వుల్లో మందు బాటిల్స్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో మందుబాబులకు కావాల్సిన బ్రాండ్ మద్యం దొరకటంలేదు. కానీ దొరికినదానితో సర్ధుకుపోదామన్నా..బోల్డత ధరలు అమ్ముతుండుటంతో మద్యం అక్రమంగా తరలించే ముఠాలు పెరిగిపోయాయి. కొత్త కొత్త ఆలోచనలతో మందు బాటిల్స్ ను పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి తరలిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ను బాక్సులో తయారు చేసిన సిలిండర్ అడుగున చక్కగా ఓపెన్ పెట్టి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.రాష్ట్ర బోర్డర్ దాటించేస్తున్న సమయంలో కొంతమంది దొరుకుతున్నారు. ఎన్నిరకాలుగా తరలించినా దొరికిపోతున్నామనే ఆలోచనతో ఏకంగా మల్లెపూలల్లో మద్యం బాటిల్స్ దాచి కర్ణాటక నుంచి తీసుకువస్తుండగా అనంతపురం జిల్లా పోలీసులు గుర్తించారు. కొంత మంది వ్యక్తులు ఓ కారులో మల్లెపూల మూటతో వస్తుండగా ఎక్సైజ్ అధికారులు శనివారం (ఆగస్టు 22,2020)రాత్రి విడపనకల్లు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించగా వీరు దొరికిపోయారు.

వ్యాపారం కోసం కర్నాటక నుంచి మల్లెపూలను తెస్తూ వాటిలో మద్యం బాటిల్స్ పెట్టి తరలిస్తున్నారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి..మల్లెపూల మూటలు తెరిచి చూడగా భారీగా లిక్కర్ బాటిళ్లు బయటపడ్డాయి. వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. 88 క్వార్టర్ సీసాలు,87 ఫుల్ బాటిళ్లు సీజ్ చేశారు. ఇలాంటి చిత్ర విచిత్ర మార్గాల్లో మద్యం రవాణా చేయడం చూసి జనాలు విస్తుపోతున్నారు.ఓరి మీ అసాథ్యం కూలా ఏమి ఐడియాలు రా నాయనా..మందు కోసం ఏకంగా మల్లెపూలే దొరికాయా మీకు గుభాళించే మల్లెపూలను కూడా మద్యం వాసనలు అంటగట్టేస్తున్నారు కదరా..అంటున్నారు.

Related Posts