లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కనిపించేవన్నీ.. శానిటైజర్ బాక్సులే అనుకుని..చిన్నారులు చిట్టి చేతులతో ఏం చేస్తున్నారో చూడండీ: కరోనా కాలపు పిల్లలు ఇలాగే ఉంటారేమో..

Published

on

us  Little girl thinks everything is hand sanitiser station : ఈ కరోనా కాలంలో చిన్నారులకు శానిటైజ్ చేసుకోవమంటే ఏంటీ..బైటకెళితే మాస్కు పెట్టుకోవటం అదీకూడా ఎలా పెట్టుకోవాలి? ఇలా అన్నీ అర్థం అయిపోతున్నాయి. కరోనా కాలంలో ఇంటికే పరిమితం అయిపోతున్న చిన్నారులు ఇంట్లోనే ఆడుకుంటున్నారు. బైటకెళదామని ఏడవటమే లేదు. పైగా అస్తమానూ తమ తమ చిట్టి చిట్టి చేతుల్ని అస్తమానూ శానిటైజర్ చేసేసుకుంటున్నారు.

అలా ఈ కరోనా కాలపు చిన్నారి ఏది కనిపించినా పాపం శానిజైజర్ బాక్సే అనుకుంటోంది. ఏది కనిపించినా శానిటైజర్ బాక్కే అనుకుంటూ..శానిటైజ్ స్టాండే అనుకుంటూ..తన చిట్టి చేతుల్ని వాటి కింద పెట్టి చేతులకు రాసుకుంటోంది. కనిపించినవాటినల్లా శానిటైజర్ బాక్సులే అనుకుంటున్న చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ చిన్నారిని చూస్తే భలే పెద్ద వాళ్లకు లేని బాధ్యత ఈ చిన్నారికి భలే ఉందే అనిపిస్తోంది.

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ దీన్ని వాడాల్సిందే. అయితే ఇదే విధంగా శానిటైజర్​ ఎక్కువగా వాడిన ఓ చిన్నారి ప్రతీ వస్తువును శానిటైజర్ మిషన్ అని అనుకుంది.

ఎలక్ట్రిక్ బాక్సుల నుంచి కలర్ ఇటుకల వరకు అన్నీ శానిటైజర్ స్టేషన్లే అనుకొని ఆ చిన్నారి చేతులు దగ్గర పెట్టి రఫ్ చేసుకుంది. చేతిలో శానిటైజర్ పడినట్టు ఊహించేసుకొని తుడుచుకుంటూ శానిటైజ్ చేసేసుకుంటోంది. “2020 తొలి సంవత్సరమైతే.. ప్రతి ఒక్కటీ హ్యాండ్ శానిటైజింగ్​ స్టేషన్​లాగే కనిపిస్తుంది” అని టెక్సాస్​కు చెందిన ఆ చిన్నారి తల్లి క్యాటీ లైట్​ఫుట్ వీడియోకు క్యాప్షన్ రాశారు.

ఎలక్ట్రిస్​ పోల్​కు ఉన్న ప్లాస్టిక్ బాక్స్​, రోడ్డు పక్కన అమర్చిన డబ్బాలు, కలర్ ఫుల్ ఇటుకలు ఇలా అన్నింటినీ ముట్టుకుంటూ చేతులు తుడుచుకుంటున్న ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. చేతుల శుభ్రత పట్ల ఆ చిన్నారి శ్రద్ధ చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కామెంట్లు కురుస్తున్నాయి.