Toddler Viral video: రెస్టారెంట్లో ఆహారం తిన్న బాలుడు.. బిల్లు కట్టాలని అతడికే చెప్పిన తండ్రి

  సరదాగా తండ్రితో కలిసి రెస్టారెంటుకు వెళ్ళిన ఓ బాలుడు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ తిన్నాడు. ఎప్పటిలాగే తినగానే తన తండ్రితో కలిసి హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఆ బాలుడికి అతడి తండ్రి ఓ షాక్ ఇచ్చాడు. ''ఇక బిల్లు కట్టు'' అని చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పిల్లాడు కాసేపు ఆలోచించాడు. ''నువ్వు ఇప్పుడు బిల్లు కట్టు.. నేను ఇంటికి వెళ్ళాక తిరిగి ఇచ్చేస్తాను'' అని తన తండ్రికి చెప్పాడు.

Toddler Viral video: రెస్టారెంట్లో ఆహారం తిన్న బాలుడు.. బిల్లు కట్టాలని అతడికే చెప్పిన తండ్రి

Toddler Viral video

Toddler Viral video:  సరదాగా తండ్రితో కలిసి రెస్టారెంటుకు వెళ్ళిన ఓ బాలుడు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ తిన్నాడు. ఎప్పటిలాగే తినగానే తన తండ్రితో కలిసి హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చని అనుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఆ బాలుడికి అతడి తండ్రి ఓ షాక్ ఇచ్చాడు. ”ఇక బిల్లు కట్టు” అని చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పిల్లాడు కాసేపు ఆలోచించాడు. ”నువ్వు ఇప్పుడు బిల్లు కట్టు.. నేను ఇంటికి వెళ్ళాక తిరిగి ఇచ్చేస్తాను” అని తన తండ్రికి చెప్పాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ బాలుడు చెప్పిన సమాధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కోట్లాది మంది దీన్ని చూశారు. ఆ బాలుడు ఊహించని విధంగా తండ్రి బిల్లు కట్టాలని చెప్పాడని, అందుకు ఆ తండ్రి ఊహించని విధంగా ఆ బాలుడు సమాధానం ఇచ్చాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. తమ పిల్లలతో కలిసి రెస్టారెంటుకు వెళ్ళినప్పుడు తాము కూడా ఇలా అడిగి చూస్తామని కొందరు కామెంట్లు చేశారు. మరోసారి రెస్టారెంటుకు వెళ్ళినప్పుడు ఆ బాలుడు డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్తాడని ఓ నెటిజన్లు సెటైర్ వేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Derek Lipp (@dereklipp_)