Walking 3 to 4 miles a day: వృద్ధులు రోజుకి 3-4 మైళ్లు నడిస్తే..? పరిశోధనలో తేలింది ఏంటంటే?
ప్రతిరోజు ఒక మైలు (2,000 అడుగులు) నడిచే వారి కంటే ప్రతిరోజు 3 నుంచి 4 మైళ్లు నడిచే వృద్ధుల్లో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 40-50 శాతం తగ్గుతుందని చెప్పారు. అమెరికా హార్ట్ అసోసియేషన్ కు చెందిన సర్క్యులేషన్ జర్నల్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Walking 3 to 4 miles a day: నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాకింగ్ చేస్తే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. నడక వృద్ధులకూ చాలా మంచిదని, గుండెపోటు, స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజాగా పరిశోధకులు తేల్చారు.
ప్రతిరోజు ఒక మైలు (2,000 అడుగులు) నడిచే వారి కంటే ప్రతిరోజు 3 నుంచి 4 మైళ్లు నడిచే వృద్ధుల్లో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 40-50 శాతం తగ్గుతుందని చెప్పారు. అమెరికా హార్ట్ అసోసియేషన్ కు చెందిన సర్క్యులేషన్ జర్నల్ లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతంలో 20,152 మంది ప్రజలకు (అందరూ 18 ఏళ్లు-అంతకంటే ఎక్కువ వయసున్న వారు) సంబంధించి జరిగిన ఎనిమిది అధ్యయనాల సమాచారాన్ని తీసుకుని పరిశోధకులు తాజాగా ఈ వివరాలను తెలిపారు.
దాదాపు ఆరేళ్ల పాటు 20,152 మంది ప్రజల ఆరోగ్య వివరాలను నమోదుచేసుకున్నారు. వేగంగా నడవడం వల్ల అదనపు ఫలితాలు ఏమీ ఉండబోవని కూడా తేల్చారు. అయితే, గతంలో ప్రచురితమైన ఓ పరిశోధన ఫలితాల్లో కూడా దీనికి సంబంధించి ఓ అంశాన్ని పేర్కొన్నారు. వేగంగా నడవడం వల్ల అనారోగ్యాల ముప్పు తగ్గుందని చెప్పారు.
#BharatJodoYatra: మీరు చెప్పేది వినడానికే ఈ యాత్ర చేస్తున్నాను: రాహుల్ గాంధీ