లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌లో రాళ్లదాడి.. కారణం ఇదే!

Updated On - 3:28 pm, Tue, 23 February 21

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులోనే కాదు.. హిందీలో కూడా వరుస సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సరసన ‘ఎటాక్’ అనే సినిమాలో రకుల్ నటిస్తోంది. ఈ చిత్రానికి లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ధానిపూర్‌లో ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా ధనిపూర్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్ వద్ద స్థానికులు రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సినిమా షూటింగ్‌పై కొందరు రాళ్లదాడి చేశారు.

జాన్ అబ్రహం, రకుల్ నటిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. చిత్ర యూనిట్ యాక్షన్ సన్నివేశాల కోసం ధనిపూర్ వెళ్లారు. తమకు దగ్గరగా సినిమా చిత్రీకరిస్తున్నట్లు తెలిసిన స్థానికులు, చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ షూటింగ్ స్పాట్ వద్ద గేట్ మూసివేయడంతో, ప్రజలు సెట్ గోడ ఎక్కి షూటింగ్ చూడటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బంది, స్థానికుల మధ్య గొడవ జరిగింది. దీంతో స్థానికులు షూటింగ్‌పై రాళ్ళు రువ్వారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టగా పరిస్థితి శాంతించింది. చిత్రయూనిట్‌కి కానీ, నటీనటులకు కానీ ఎటువంటి గాయాలు అవ్వలేదు.

మరోవైపు అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో సినిమాలో కూగా రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అజయ్‌ దేవగన్‌ ‘థాంక్‌ గాడ్‌’ లోనూ రుకుల్ చేస్తోండగా.. కామెడీ డ్రామా డాక్టర్‌ జీలో ఆయుష్మాన్‌ ఖురానాతో జోడీ కట్టింది రకుల్ ప్రీత్ సింగ్.

 

View this post on Instagram

 

A post shared by Aligarianhub (@aligarianhub)