వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో బతకాల్సిందే.. లాక్ డౌన్ పరిష్కారం కాదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో బతకాల్సిందేనని లాక్ డౌన్ పరిష్కారం కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన జాగ్రత్తలో మనం ముందుకు సాగాలన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు 5 అంబులెన్స్ లు అందజేశారు. జెండా ఊపి అంబులెన్స్ లను ప్రారంభించారు. మంత్రి జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ వార్డులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ కరోనా సమస్యకు పరిష్కారం కాదన్నారు. లాక్ డౌన్ పెట్టనంత మాత్రాన ఇది పరిష్కారం కాదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వల్ల ఏ దేశంలో కూడా కరోనా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కరోనాను నివారించాలని, వైరస్ రాకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పారు.

కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తామని చెప్పారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో అదనపు సిబ్బందిని తీసుకుంటామని చెప్పారు. రాయోయే ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు అన్ని రకాల హంగులతో సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేస్తున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కోవాలంటే నివారణ ఒక్కటే మార్గమన్నారు. అవగాహన పెంచుకుని కరోనాను ఎదుర్కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్ ను వాడాలని సూచించారు.

సిరిసిల్ల జిల్లాలో రోజు వెయ్యి పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వం, పారామెడికల్, మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Related Posts