లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మైనర్ బాలికపై అత్యాచారం చేసి,వీడియో తీసిన లోకో పైలట్

Published

on

Loco pilot rapes 13-year-old girl in Kanpur, films criminal act on mobile : ప‌ద‌మూడేళ్ల మైనర్ బాలిక‌పై అత్యాచారం చేయటమే కాక…. ఆ బాలిక‌ను వివ‌స్త్రను చేసి వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డిన లోకో పైల‌ట్‌ను కాన్పూర్ పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. బాలిక క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతూ తండ్రికి విష‌యం చెప్ప‌డంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్ర‌యాగ్ రాజ్ కు చెందిన‌ అభిషేక్ ప‌టేల్‌ అనే రైల్వే ఉద్యోగిని అరెస్ట్ చేశారు.అభిషేక్ ప‌టేల్ బాలిక‌ను మాయమాటలతో ఆకర్షించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికకు తెలియకుండా లైంగిక‌ దాడికి సంబంధించిన వీడియో తీసాడు. ఆ క్లిప్‌ను ఆమెకు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధిత బాలిక‌ను అత‌డు బెదిరించాడు. ఈ విష‌యాన్ని పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) దీపక్ భూకర్ స్ప‌ష్టం చేశారు.గ‌త కొన్నిరోజులుగా త‌న‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ త‌న‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డుతున్నాడ‌ని బాలిక పోలీసుల‌కు చెప్పటంతో అభిషేక్ ప‌టేల్‌ను లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద అరెస్టు చేసి గురువారం జైలుకు పంపినట్లు దీపక్ భూకర్ చెప్పారు. బాలిక‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి, అభ్యంతరకరమైన వీడియోను చిత్రీకరించేందుకు అతను ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *