Home » రూమ్ ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ హత్య
Published
2 months agoon
By
murthylodge manager murdered in Dharmavaram : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ధర్మవరంలో ఆదివారం రాత్రి ఉమాలాడ్జికి ముగ్గురు వ్యక్తులు రూమ్ కావాలంటూ వచ్చారు. ఆ సమయంలో వారు ముగ్గురు మద్యం సేవించి ఉండటంతో వారికి రూమ్ ఇచ్చేందుకు లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య నిరాకరించాడు.
యువతి ప్రాణం తీసిన చీమలు : మంటల్లో సజీవదహనమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
మద్యం మత్తులో ఉన్నవారు ఈశ్వరయ్యతో గొడవకు దిగారు. ఈక్రమంలో ఈశ్వరయ్యను వారు గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరోక వ్యక్తి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.