ఎంపీల జీతంలో 30శాతం కోత బిల్లుకు లోక్ సభ ఆమోదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోవిడ్‌-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో భాగంగా.. పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించేందుకు రూపొందించిన బిల్లు ‘సాలరీ, అలవెన్స్​ అండ్​ పెన్షన్​ ఆఫ్​ మెంబర్స్​ ఆఫ్​ పార్లమెంట్ ఆర్డినెన్స్​,2020’ ను మంగళవారం లోక్​సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

కాగా, ఎంపీల జీతాల్లో కోత విధించాలని ఈ ఏడాది ఏప్రిల్​ లో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే . ఏప్రిల్- 6న ఈ ప్రదిపాదనకు కేంద్ర కేబినెట్​ ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాతి రోజే ఆర్డినెన్స్​ జారీ అయింది.


లోక్​సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. సాధారణంగా ఎంపీలకు వేతనాల రూపంలో నెలకు రూ. లక్ష అందాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్​ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్​ నుంచి రూ. 70వేలు మాత్రమే పొందుతున్నారు.


మరోవైపు డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్‌లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్‌క్రాఫ్ట్‌ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలికసదుపాయాలు మరింత బలోపేతమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Related Posts