లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

చూయింగ్ గమ్ లో మహిళా DNA

Published

on

This Is 'Lola,' a 5,700-Year-Old Woman Whose Entire Life Is Revealed in Her 'Chewing Gum'

ఒక్కోక్కసారి చిన్న వస్తువుల నుంచే ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను గురించి చెప్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లలో చూయింగ్  బయట పడింది. ఆ చూయింగ్ గమ్ వంటి పదార్ధంలో మహిళ డీఎన్ఏ ఉన్నట్లు కనుగొన్నారు.

క్రీస్తు పూర్వం 10 వేల సంవత్సరాల నుంచి 4 వేల సంవత్సరాల మధ్య కాలాన్ని నియోలిథిక్ యుగంగా పిలుస్తారు. ఈ యుగంలో  జీవించిన మహిళా డీఎన్ఏ,అప్పట్లో ఆమె నోటిలో జీవించిన సూక్ష్మ క్రిముల ఆధారంగా గుర్తించారు.

డెన్మార్క్ లోని లోలాండ్ ద్వీపంలోని ఎండిపోయిన ఉప్పు నీటి సరస్సులో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు వలన 2 సెంటీమీటర్ల పొడవున్న చూయింగ్ గమ్ లభించింది. లోలాండ్ ద్వీపంలో కోపెన్ హాగన్ యూనివర్సటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల కారణంగా అందులో మానవ డీఎన్ఏ ఉన్నట్లు గుర్తించారు.

ఆ చూయింగ్ గమ్ ను ‘బిర్చ్’(కొండరావి చెట్టు) చెట్టు నుంచి తయారుచేసినట్లు గుర్తించారు. ఈ చెట్ల బెరడును కాల్చి, ఆ బూడిద తో పేస్ట్ లాగా తయారుచేస్తారు. దీనిని బిర్చ్ టార్ అంటారు. కొన్ని వేల సంవత్సరాలగా అంటించేందుకు గమ్ గా వినియోగిస్తున్నారు. 

ఆ చూయింగ్ గమ్ లో ఉన్న డీఎన్ఏ ఆధారంగా 5 వేల సంవత్సరాల క్రితం జీవించిన మహిళ అని నిర్ధారించుకున్నారు. ఆమెకు నల్లని చర్మం, నల్లని కురులు, నీలి రంగు కళ్ళు ఉన్నట్లు తెలిసింది. అప్పట్లో ఆ మహిళ నోట్లో న్యూమోనియాను కలిగించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు.