కుక్కను షికారుకు తీసుకెళ్లే ఉద్యోగం..నెలకు రూ.2లక్షల జీతం..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

London : dog walker Job for mounth Rs.2 lakh Salary : నెలకు కనీసం రూ. 20 వేలు తెచ్చుకునే జాబ్ దొరకటమే కష్టం అయిపోతున్న ఈ రోజుల్లో కేవలం ‘‘కుక్క’’ను షికారుకు తిప్పటం..దాని బాగోగులు చూసుకుంటే చాలు మనం ఊహించనంత నెల జీతం ఇస్తారంటే.. ఎగిరి గంతేసి మరీ వెళ్లిపోతాం. కుక్క బాగోగులు చూసుకుంటే నెలకు రూ.2 లక్షల జీతమని ప్రకటించిందీ ఓ సంస్థ. వాళ్లు ప్రకటించిన జీతం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ‘‘అబ్బా ఎన్నాళ్లు ఈ రూ.20 వేలు 30వేలు జీతాల జాబులు ఎంత కాలం కష్టపడితే నెలకు రూ.2లక్షలొస్తాయ్..ఇదేదో బాగుంగే అనుకునే వారు ఈ కుక్క జాబు గురించి తెలుసుకోవాల్సిందే..


వివరాల్లోకి వెళితే..లండన్‌లోని ‘జోసఫ్‌ హేజ్‌ ఆరోన్‌సన్‌’ న్యాయవాద సంస్థ ఓ చిత్రమైన ఉద్యోగాన్ని ప్రకటించింది. కుక్కలను ప్రేమించేవారే ఈ జాబుకు అర్హులు అంటూ ప్రకటించింది. ‘మా సంస్థలోని ఓ సీనియర్‌ అడ్వకేట్ వద్ద ఓ పెంపుడు కుక్క ఉంది.ఆ కుక్క బాగుగులో చూసుకుంటే నెలకు రూ.2లక్షల జీతం ఇస్తామని ప్రకటించింది. ఆ కుక్కను ఉదయం, సాయంత్రాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా బైటకు వాకింగ్‌కు తీసుకెళ్లాలి. అంటూ కొన్ని నిబంధనలతో కూడిన డాగ్‌‌వాకర్‌‌గా చేయాలని ఇంట్రస్టు ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రకటించింది.


కుక్కును చూసుకునే ఈ ఉద్యోగానికి అక్షరాలా ఏడాదికి 30 వేల పౌండ్ల జీతం. ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు రూ.29 లక్షలు. అంటే నెలకు రెండు జీతం. ఇస్తామనీ… కాకపోతే ముఖ్యమైన షరతు ఏమిటంటే..కుక్కలను ప్రేమించేవారే ఈ ఉద్యోగానికి అర్హులు అన్న విషయం మరిచిపోవద్దని సూచించింది.


ఈ డాగ్‌ వాకర్‌ ఉద్యోగానికి ఆడ, మగ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కుక్కలను జాగ్రత్తగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యమని దానిక అనుభవం ఉన్న డాగ్ వాకర్ చాలా ముఖ్యం’ అని ప్రకటనలో తెలిపింది.


ఈ ఉద్యోగానికి సదరు సంస్థ మరో ఆఫర్ కూడా ప్రకటించింది. జీతం కాకుండా పెన్షన్,,లైఫ్ ఇన్సూరెన్స్ లతో పాటు ప్రైవేటు ఆరోగ్య , డెంటల్‌ బీమా సదుపాయాలు కూడా ఉంటాయని తెలిపింది. ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.


అంతేకాకుండా డాగ్‌ వాకర్‌ కూర్చున్న చోట, కూర్చోకుండా కుక్క వెంట లండన్‌ వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని..ఇందుకు ఉద్యోగికి ఫిట్‌నెస్‌ కూడా అవసరమని షరతు విధించింది. ప్రతి శనివారం, ఆదివారం సెలవులు తీసుకోవచ్చనీ..రోజూవారి వర్కింగ్ టైమ్ లో మాత్రం ఖచ్చితంగా వర్క్ లో ఏమాత్రం అలసత్వం గానీ..నిర్లక్ష్యంగానీ ప్రదర్శంచకూడదని తెలిపింది. కాగా..ఈ డాగ్ వాకర్ ఉద్యోగ ప్రకటనకు వేలల్లో అప్లికేషన్స్ వస్తున్నాయని తెలిపింది సదరు సంస్థ.

Related Tags :

Related Posts :