లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మహిళలు, వృద్ధుల్లో నెలల తరబడి కరోనా లక్షణాలు

Published

on

Covid-19కు గురైన వారిలో ఇప్పటికీ సుదీర్ఘకాలం నుంచి ఎఫెక్ట్ లు కనిపిస్తున్నాయి. కొందరిలో క్లియర్ అయిపోతుంటే.. మరి కొందరిలో నెలల తరబడి లక్షణాలు కనిపిస్తున్నాయి. వారాలు, నెలలు గడుస్తున్నా వైరస్ లక్షణాలు కనుమరగవడం లేదు. వీరిలో కరోనా లక్షణాలు సుదీర్ఘ కాలం కనిపించడం నీరసం, తలనొప్పి, శ్వాస్ అందకపోవడం, గుండె కొట్టుకోవడంలో వేగం, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి కనిపిస్తున్నాయి.

కింగ్స్ కాలేజీ లండన్ రీసెర్చర్లు.. ఈ సమస్యలు మహిళలు, వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. కరోనా ఆరంభ దశలో ఎక్కువగా లక్షణాలు కనిపించిన వారిలోనే చాలా కాలం పాటు ఈ లక్షణాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పారు.

యూకేలో ఉన్న 4వేల 182మంది కొవిడ్ పేషెంట్లపై సర్వే నిర్వహించగా.. ఏడుగురిలో ఒకరికి సుదీర్ఘ కాల కొవిడ్ ఉంటుందని నాలుగు వారాలకు మించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 20మందిలో ఒకరికి ఎనిమిది వారాలు అంతకమించి, 50మందిలో ఒకరికి 12వారాల తర్వాత కూడా Covid-19 లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిసింది. 11రోజుల తర్వాత మిగిలిన వారు బెటర్‌గా ఫీల్ అవుతున్నారు.

సుదీర్ఘ కాలం కొవిడ్ తో సతమతమవుతున్న వారు రెండు క్యాటగిరీలుగా ఉన్నారు. వారిలో ఒక గ్రూప్ దగ్గు, శ్వాస సమ్య, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తుండగా, మిగిలిన వారిలో పేగుల్లో సమస్య, గుండె వేగం మారుతుండటం, వణుకు రావడం, స్తబ్దుగా ఉండటం వంటివి కనిపిస్తున్నాయి.

‘కొవిడ్ అనేది చాలా మందిలో కనిపిస్తున్న అనారోగ్యమే. 50మందిలో ఒకరు ఈ లక్షణాలతో 12వారాలకు పైగా బాధపడుతున్నారు. వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. త్వరలో కరోనాను అదుపు చేయలేకపోతే సుదీర్ఘ కాలం కరోనా బారినపడేవారు ఎక్కువ అవుతారు’ అని కింగ్స్ కాలేజి జెనెటిక్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డా. టిమ్ స్పెక్టార్ అన్నారు.

వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నంత కాలం మన లైఫ్ సైల్ లో మార్పులు రావాలి. టెస్టుల్లో పాజిటివ్ వస్తే.. సెల్ఫ్ ఐసోలేటింగ్ టెక్నిక్ వాడాలి. అయితే ఈ లక్షణాలన్నీ వృద్ధుల్లో, మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొవిడ్-19తో ఇబ్బందిపడుతున్న వారిలో 21.9శాతం మందికి కొవిడ్ లక్షణాలు డెవలప్ అవుతున్నాయి. 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళల్లో అదే వయస్సున్న మగాళ్లంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా కనిపిస్తున్నాయి. మగాళ్లలో 9.5శాతం ఇబ్బంది కనిపిస్తుంటే 14.9శాతం మహిళల్లో కనిపిస్తుంది.

కరోనా తొలివేవ్ నుంచి కాస్త జ్ఞానం పొంది ఉండాల్సింది. రెండో సారి కరోనా వ్యాపించిందంటే సుదీర్ఘ కాలం ఎఫెక్ట్ కనిపించడంతో పాటు వెంటనే తగ్గదు కూడా. అని డా.క్లెయిర్ స్టీవ్స్ చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *