లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కొవిడ్-19తో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు, అవి చాలా తీవ్రంగా ఉంటాయి

Published

on

కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచి శక్తులు కోల్పోవడం, గొంతు మంట కూడా కొవిడ్ లక్షణాలే. ఆ తర్వాత వికారం, విరేచనాలను కూడా కొవిడ్ లక్షణాల్లో జోడించారు.ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. దీంతో కరోనా సంక్రమణ లక్షణాలను గుర్తించడంతో పాటు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఏంటి అనేదానిపైనా డాక్టర్లు దృష్టి పెట్టారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు ఉంటున్నాయి అనే అంశాలపై సీడీసీ చాలా పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3వేల మందిపై(అడల్ట్ పేషెంట్స్) స్టడీ చేస్తున్నారు. అసలు కరోనా వ్యాధి దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవడానికి డాక్టర్లకు కొంత సమయం పట్టనుంది.

కరోనా నుంచి కోలుకున్నాక చాలామందిలో గుండె జబ్బులు బయటపడ్డాయి. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గుండె జబ్బులే కాదు ఊపిరితిత్తుల సమస్యలు కూడా బయటపడ్డాయి. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో 90శాతం మందిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాదు చాలామందిలో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు. ఆరోగ్య వంతులతో పోలిస్తే వీరిలో అన్ని వ్యవస్థలు పూర్తి స్థాయిలో కోలుకోలేదని గుర్తించారు. యథాతథ స్థితి ఆరోగ్యం రావడానికి చాలా సమయమే పడుతోంది. దీంతో కరోనా నుంచి కోలుకున్నామన్న ఆనందం లేకుండా పోతోంది.అసలు సమస్య కరోనా నుంచి కోలుకున్న తర్వాతే ఎదురువుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరు మునుపటిలా చాలా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. గతంలోలా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించలేకపోతున్నారు. దీంతో కరోనా నుంచి రికవరీ అయిన తర్వాత ఎదురయ్యే దుష్ప్రభావాలను ఫేస్ చేయడం సవాల్ గా మారింది. ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా, ఎందుకిలా జరుగుతోంది, ఆరోగ్య సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి అనేది తెలుసుకోవడానికి వైద్య నిపుణులు చాలా పెద్దఎత్తున స్టడీ చేస్తున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *