‘Looking at all possible options to stage IPL’: Sourav Ganguly

ఖాళీ స్టేడియంలలో ఐపీఎల్ జరపవచ్చు: సౌరవ్ గంగూలీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నామని, అవసరమైతే ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ ఆడించే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖ రాశారు.

కోవిడ్-19 కారణంగా ఐపీఎల్ టీ20 లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. దేశీయ సెషన్‌ను తిరిగి ప్రారంభించే వరకు ఐపిఎల్ నుంచి బోర్డు కార్యకలాపాల గురించి గంగూలీ రాష్ట్ర సంఘాలకు తన లేఖలో తెలియజేశారు. “క్రికెట్ త్వరలో నెమ్మదిగా ప్రారంభం అవుతుందని నేను భావిస్తున్నాను. అంతేకాదు.. భారతదేశంలో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడానికి కొన్ని నెలలు పడుతుందని అనిపిస్తుంది” అని గంగూలీ లేఖలో రాశారు.

ఐసిసి బోర్డు సమావేశాన్ని అనుసరించి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాసిన లేఖ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భవిష్యత్తు గురించి సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది టీ20ప్రపంచకప్ జరగడం అనేది సాధ్యం కాకపోవచ్చునని, ఈ క్రమంలోనే ఐపిఎల్‌కు ఆతిథ్యమివ్వడానికి బిసిసిఐ సిద్ధంగా ఉందని, ఈ సంవత్సరం టోర్నమెంట్‌ను నిర్వహించడానికి అన్నీ మీర్గాలపై కృషి చేస్తున్నట్లు బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.

ఖాళీ స్టేడియాలలో అయినా.. ఐపీఎల్ ఆడాలని, అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళు, ప్రసారకులు, స్పాన్సర్‌లు ఇతర వాటాదారులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇతర దేశాల ఆటగాళ్ళు కూడా ఐపిఎల్‌లో పాల్గొనడానికి తమ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై బిసిసిఐ త్వరలో నిర్ణయం తీసుకుంటుదని అన్నారు. 

ఇప్పటికే గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమ్మిన్స్ సహా కొంతమంది విదేశీ ఆటగాళ్ళు బహిరంగంగా ఐపీఎల్‌కు తమ మద్దతును ప్రకటించారు. మరోవైపు ఐపీఎల్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ ముంబైలో ఘన్సోలిలోని ముంబై శివార్లలోని రిలయన్స్ స్టేడియంలో శిక్షణను ప్రారంభించబోతుంది. ముంబైలో నివసించే క్రీడాకారులు, రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ పాండ్యా, ధావల్ కులకర్ణి, మరియు ఆదిత్య తారే ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చునని ఫ్రాంచైజ్ తెలిపింది.

Read: కోహ్లీ, రోహిత్ ల ఔట్ కు అంపైర్ సాయం కోరిన ఫించ్

Related Posts