లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

న్యూస్ ఛానెళ్లకు కొత్త కోడ్ పెట్టాలనుకుంటున్నాం: కేంద్ర మంత్రి

Published

on

న్యూస్ మీడియా రెగ్యూలేటరీ మెకానిజం బలపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. సోమవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా వెబినార్ లో అటెండ్ అయినా ఆయన కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. ప్రభుత్వం అనేది వార్తల్లో ఎంటర్ అవకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని కొన్ని రెగ్యూలేటరి నియమాలు పెట్టనున్నారు.

‘ప్రెస్ స్వేచ్ఛ గురించి ఈ రోజు మరోసారి చర్చించాం. ప్రెస్ స్వేచ్ఛపై దాడి జరుగుతుంది. అది మంచిది కాదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)అనే సెల్ఫ్ రెగ్యూలేషన్ కు మరో మెకానిజం. దీని అధికారిని ప్రభుత్వమే నియమిస్తుంది. వారు ప్రెస్ ఓనర్లు, ఎడిటర్లు, జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, పార్లమెంటేరియన్లు అయి ఉండొచ్చు. కానీ, ప్రజలు పీసీఐకి మరిన్ని పవర్స్ కావాలని అడుగుతున్నారు. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.ప్రెస్ కౌన్సిల్ లాంటి ఉన్నతమైన అధికారాన్ని లెక్కచేయకుండా టీవీ వార్తలు టెలికాస్ట్ చేస్తే దాని గురించి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ‘అలా చేసినందుకు ఎవరిపైనైనా కంప్లైంట్ చేయొచ్చు. ఆ ఛానెల్స్ కు శిక్ష పడుతుంది’ అని జవదేకర్ చెప్పారు. ‘కానీ, చాలా ఛానెళ్లు ఒక వ్యవస్థ, నియమాలు లేకుండా వ్యవహరిస్తున్నాయని.. అలాంటివి ఉండనవసరం లేదని’ వెల్లడించారు.

కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లేనా?


దాంతో పాటు డిజిటల్, ఓటీటీ ప్లాట్ ఫాంల గురించి కూడా మాట్లాడారు. వాటిపైనా రెగ్యూలేటరీ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇందులోకి మేం జోక్యం చేసుకోవాల్సిన టైం వచ్చింది. మానిప్యులేషన్ ను ఎలా తుడిచిపెట్టాలా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ఓ కమిటీ పెట్టేందుకు రెడీ అయ్యాం. దీనిపై త్వరలోనే రిపోర్ట్ రెడీ చేస్తాం’ అని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *