లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

బాగా వంట చేస్తా……అంట్లు తోముతా…. నాకు గర్ల్ ప్రెండ్ కావాలి

Published

on

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బోలెడన్నీ యాప్ లు, సైట్ లు ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. వాటిలో డేటింగ్ యాప్ లు, ప్రెండ్ షిప్ యాప్ లు ఇలా పలు రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల యాప్ ల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయం అవుతున్నా కానీ…. బ్రిటన్ లోని నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన అలెన్‌ క్లేటన్‌ వ్యక్తికి చెట్టాపట్టాలేసుకు తిరగడానికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు.

లారీ డ్రైవర్ అయిన అలెన్ గడిచిన 10 ఏళ్లలో అవకాశం ఉన్న సోషల్ మీడియా ద్వారా, డేటింగ్ యాప్ ల ద్వారా గర్ల్ ప్రెండ్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఏ ఒక్క అమ్మాయి అలెన్ ను చూసి ఓకే చెప్పలేదు. తనతోటి వారందరూ గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటే తనకు మాత్రం ఒక్కరూ దొరక్కపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. చివరకి తననుతాను అమ్ముకోడానికి సిధ్ద పడ్డాడు. ఇందుకోసం ఫేస్ బుక్ లో అలెన్ ఫర్ సేల్ అంటూ ఒక ప్రకటన ఇచ్చాడు.


నాపేరు అలెన్.. వయస్సు 30 సంవత్సరాలు…అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను. త్వరలో చాలా పెళ్లిళ్లకు వెళ్లాల్సి వుంది. వాటికి ఒంటరిగా వెళ్ళదలచుకోలేదు. డేటింగ్ సైట్లలో అమ్మాయిల కోసం చాలా ట్రై చేశాను…. కానీ అదృష్టం కలిసి రాలేదు….అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను అని ప్రకటించాడు. ఇంత క్లియర్ గా తన అభిప్రాయం చెప్పినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేసి, మాట్లాడినా డేటింగ్ వరకూ రాలేదు.


alan lan claytonకాగా…. తన ప్రకటన వల్ల ఫలితం ఉంటుందని ఎదురు చూస్తున్నాడు. కొడుకు ఇచ్చిన ప్రకటన చూసిన అలెన్ తండ్రి ఫ్రాంక్ కూడా ఆశ్చర్యపోయాడు. అయినా కొడుకును అభినందించాడు. తన కొడుకు చాలా మంచివాడని.. ఏపని చెప్పినా చేస్తాడని… మంచిగా వంట చేస్తాడని, అంట్లు బాగా తోముతాడని మెచ్చుకున్నాడు.  ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా మరి మనోడికి గర్ల్ ప్రెండ్ దొరుకి ఐ లవ్ యూ చెబుతుందో లేదో వేచి చూడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *