Home » క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ పాస్వర్డ్ మర్చిపోయాడు.. రూ.1,800 కోట్లు గల్లంతు!
Published
2 weeks agoon
Lost passwords lock millionaires : క్రిప్టో కరెన్సీ.. అదేనండీ.. బిట్ కాయిన్.. ఇదో డిజిటల్ కరెన్సీ.. హైసెక్యూరిటీ ఎన్ క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌తో ఆపరేట్ చేస్తుంటారు. భద్రంగా ఉండాలంటే హైసెక్యూర్ పాస్ వర్డ్ ఉండాల్సిందే.. బిట్ కాయిన్ల విలువ కొన్ని మిలియన్ల డాలర్లు ఉంటాయి. అలాంటి విలువైన క్రిప్టోకరెన్సీ ఒక పాస్ వర్డ్ పోవడంతో గల్లంతయ్యింది. జర్మనీకి చెందిన స్టీఫెన్ థామస్ శాన్ఫ్రాన్సిస్కోలో ప్రొగ్రామర్.. ఇతగాడు బిట్ కాయిన్ల యాక్సస్ చేసే పాస్ వర్డ్ మరిచిపోయాడు. దాంతో దాదాపు 220 మిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.1,800 కోట్లు) క్రిప్టో కరెన్సీని కోల్పోవాల్సి వచ్చింది.
ఒక పాస్వర్డ్ బిట్ కాయిన్లు కొనుగోలు చేసిన మిలియనీర్ల అదృష్టాన్ని కోల్పోయేలా చేసింది. 2011లో 7,002 బిట్ కాయిన్లను థామస్ కొనుగోలు చేశాడు. దాని విలువ రూ.1,800 కోట్లకు పైగా(220 మిలియన్ డాలర్లు) పెరిగింది. థామస్ ఆ కాయిన్లను IronKey అనే ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లో పాస్‌వర్డ్‌తో హైసెక్యూరిటీ సెట్ చేశాడు. ఈ పాస్ వర్డు యాక్సస్ చేయాలంటే 10సార్లు ట్రై చేయొచ్చు. అంతకంటే ఎక్కువసార్లు తప్పుగా పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే వెంటనే లాక్ అయిపోతుంది. అంతేకాదు.. బిట్ కాయిన్లు అన్నీ గల్లంతు అయిపోతాయి. మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది.
అంత హైసెక్యూరిటీ ఉంటుంది. థామస్ కు కూడా అదే సమస్య ఎదురైంది. కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ కూడా కోల్పోయే పరిస్థితి ఎదురైంది. థామస్ పాస్ వర్డ్ మర్చిపోయి తప్పుగా 8 సార్లు ప్రయత్నించాడు. ఇంక రెండు ప్రయత్నాలే మిగిలాయి. ఈ రెండు సార్లు కూడా పాస్ వర్డ్ తప్పుగా ఎంటర్ చేస్తే అంతే సంగతులు.. బిట్ కాయిన్లు మాయమైపోతాయి. అకౌంట్లో బిట్ కాయిన్లు మళ్లీ రికవరీ చేసుకోవడం కుదరదు. ఏ బ్యాంకు కూడా దీనికి బాధ్యత వహించవు. అలాంటి ఫెసిలిటీ ఈ క్రిప్టో కరెన్సీలో అసలు ఉండనే ఉండదు.
ఇలా బిట్ కాయిన్ అకౌంట్లను నిర్వహించేవారంతా పాస్వర్డ్లు మర్చిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ సొమ్ము రూ.9.5 లక్షల కోట్లకు పైగానే కోల్పోయారంట.. 2011లో ఒక బిట్‌కాయిన్ వాలెట్‌కు ప్రైవేట్ కీ ఉన్న ల్యాప్‌టాప్‌ను ఒక సహోద్యోగి రీఫార్మాట్ చేశాడు. బార్బడోస్‌కు చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అబెడ్ సుమారు 800 బిట్కాయిన్లను కోల్పోయాడు. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 18.5 మిలియన్ బిట్కాయిన్లలో 20శాతం ప్రస్తుతం 140 బిలియన్ డాలర్ల విలువైనదిగా పేర్కొంది.