లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

దేశాన్ని విభజించేందుకే ‘లవ్ జీహాద్’ పదాన్ని బీజేపీ తయారుచేసింది

Published

on

Love Jihad Word Manufactured By BJP దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో “ల‌వ్ జిహాద్” కేసులు పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రేమ పేరుతో మ‌తాంత‌ర వివాహాలు జ‌రుగుతున్నాయ‌ని, హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను.. ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టాలు చేసేందుకు ఇప్పటికే కర్ణాటక,హర్యానా,మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. అయితే ఇదే విషయమై ఇవాళ(నవంబర్-20,2020) భారతీయ జనతా పార్టీపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.దేశాన్ని విభజించేందుకు మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే “లవ్ జీహాద్” అనే పదాన్ని అధికార బీజేపీ తయారుచేసిందని రాజస్తాన్ సీఎం విమర్శించారు. సామాజిక ఘర్షణలకు ఓ ఇంధనంలా లవ్ జీహాద్ అనే పదాన్ని బీజేపీ ఉపయోగిస్తోందని గెహ్లాట్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మరియు జీవిత భాగస్వాముల ఎంపికలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను బీజేపీ ఉల్లంఘిస్తోందని గెహ్లాట్ ఆరోపించారు. ఈ మేరకు గెహ్లాట్ ఇవాళ వరుస ట్వీట్ లు చేశారు.వివాహం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించిన విషయమని, దీన్ని నాశనం చేసేందుకు ఓ చట్టం తీసుకురావడమేనది పూర్తిగా రాజ్యాంగవిరుద్దమని,ఏ ఒక్క చట్టబద్దమైన కోర్టులో ఇది నిలబడదని గెహ్లాట్ పేర్కొన్నారు. ప్రేమలో జీహాద్ కి స్థానం లేదన్నారు. పెద్దలు సమ్మతి తెలపడం అనేది రాష్ట్ర అధికారం యొక్క దయతో ఉంటుంది అనే ఒక వాతావారణాన్ని దేశంలో కేంద్రప్రభుత్వం సృష్టిస్తోందని గెహ్లాట్ విమర్శించారు. వివాహం వ్యక్తిగత నిర్ణయమని,దానిపై బీజేపీ ఆంక్షలను పెడుతుందని,ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని గెహ్లాట్ విమర్శించారు.అయితే,గెహ్లాట్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. లవ్ జీహాద్ కారణంగా వేలాదిమంది యువతులు ట్రాప్ కు గురయ్యారని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్వీట్ చేశారు. లవ్ జీహాద్ అనేది ఓ ట్రాప్(వల)అని,వేలాదిమంది యువతులు వివాహం వ్యక్తిగత విషయం అని నమ్ముతారని,అయితే తర్వాత వారు అనుకున్నట్లుగా జరుగడంలేదని షెకావత్ తెలిపారు. ఒకవేళ ఇది వ్యక్తిగత స్వేచ్ఛ అయితే.. మహిళలు ఎందుకు తమ మతాన్ని పాటించేలా అనుమతించబడటంలేదు అని గెహ్లాట్ ని షెకావత్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పై షెకావత్ విమర్శలు గుప్పించారు. ఉత్పత్తి నిబంధనలు,అల్లర్లు,విద్వేషం అనేది కాంగ్రెస్ కలిగిన ప్రత్యేక హక్కులు అని విమర్శించారు. బీజేపీ సబ్ కా వికాస్ ని నమ్ముతుందని, మహిళలు ఏ విధంగా అన్యాయానికి గురవ్వకూడదనేదే తమ వైఖరి అని షెకావత్ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *