Home » ప్రేమోన్మాది ఘాతకం…..యువతిపై దాడి, హత్య
Published
3 months agoon
By
murthyLove maniac attacks young girl with knife : విజయవాడలో దారుణం జరిగింది. యువతి ప్రేమించటం లేదని ఓ ఉన్మాది ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. బెజవాడలోని క్రీస్తురాజపురంలో ఓ ప్రేమోన్మాది దాడిలో ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని బలయింది. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఈఘటన జరిగింది. నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయిపై ఇంటికి వెళ్లి మరీ దాడి చేశాడు నాగేంద్ర అనే ప్రేమికుడు. కత్తితో విచక్షణా రహితంగా గొంతుకోసి ఆపై తానూ గాయపరచుకున్నాడు.
నాగేంద్ర దాడిలో తేజస్విని ఈఎస్ఐ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కళ్లముందే కూతురిపై దాడి చేయడంతో.. ఆమె తల్లి కన్నీరు మున్నీరవుతోంది. నాలుగేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లి కూడా చేద్దామని రెండు కుటుంబాలు నిశ్చియించుకున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో తన కూతురును చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధం కావడం లేదని తేజస్విని తల్లి చెబుతున్నారు.
వీరిద్దరూ నాలుగు రోజులుగా ఏదో విషయంపై గొడవ పడుతున్నారని.. వాళ్లే సర్థుకుంటారులే అని అంతగా పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. నాగేంద్ర మంచి వ్యక్తి అని.. ఎటువంటి చెడు అలవాట్లు లేవని స్నేహతులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా మూడీగా ఉంటున్నాడని.. ఎంత అడిగినా కారణం చెప్పలేదంటున్నారు.
అందరితో మంచివాడుగా ఉండే నాగేంద్ర ఇలా సడెన్గా రాక్షసుడిగా మారడంతో ఇటు కుటుంబసభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్ది రోజుల్లోనే వివాహం అనుకుంటున్న సమయంలో .. సమస్య తమ దృష్టికి తీసుకురాకుండా ఇలా దాడి చేయడంపై తేజస్విని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నిందితుడు నాగేంద్ర చెబితేనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమోన్మాది చేతిలో మృతిచెందిన తేజస్విని తల్లిదండ్రుల నుంచి వివరాలు తీసుకుంటామని విజయవాడ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నాగేంద్రను కూడా విచారిస్తామని ఏసీపీ శ్రీనివాసులు చెప్పారు.