Love matters in marriage, not the country where your partner comes from: Shoaib Malik on wife Sania Mirza

పెళ్లికి కావాల్సింది ప్రేమ.. దేశం కాదు: సానియా మీర్జాపై షోయబ్ మాలిక్ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

షోయబ్ మాలిక్.. సానియా మీర్జా 2010లో పాకిస్తాన్, ఇండియా ప్రజలు ఆశ్చర్యపడేలా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. కానీ, వారి రిలేషన్‌షిప్‌లో ఏ నాడు పొరుగుదేశాల వైరానికి చోటు ఇవ్వలేదు. పెళ్లి తర్వాత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ దుబాయ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. వీరికి 2018లో బాబు కూడా పుట్టడంతో ఇజాన్ మీర్జా-మాలిక్ అని పేరు కూడా పెట్టారు. 

ఇటీవల షోయబ్ అతని పెళ్లి గురించి స్పందించాడు. 2010లో సంప్రదాయం ప్రకారం.. ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో పెళ్లి చేసుకునే ముందు కాస్త భయపడ్డాడట. ‘పెళ్లిలో మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు, మీ పార్టనర్ ఎక్కడి వారు అనే ఆలోచన వద్దు. దేశాల మధ్య జరిగే రాజకీయాలు అస్సలు పట్టించుకోకూడదు. అది మన పని కాదు. మీరెవరినైనా ప్రేమించి అదే వ్యక్తిని పెళ్లాడాలనుకుంటే ఇవన్నీ పెద్ద విషయాలుగా కనిపించవు. మనమే దేశం నుంచి వచ్చామనే ఆలోచన కూడా ఉండదు’

‘ఇంకో వైపు నాకు చాలా మంది ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి నేనెప్పుడూ ఫీల్ అవ్వలేదు. నేను క్రికెటర్ ను, రాజకీయ నాయకుడిని కాదు’ అని షోయబ్ అన్నాడు. ఇండియా-పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల విషయంపై మాట్లాడుతూ.. ప్రపంచమంతా మళ్లీ ఇరుదేశాల మధ్య క్రికెట్ పునరుద్దరించాలనే కోరుకుంటుంది. 
‘యాషెస్ క్రికెట్ తో పోల్చుకుని మళ్లీ జరగాలనుకుంటుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ యాషెస్ సిరీస్ లేకుండా ఊహించుకోగలమా? రెండు సిరీస్ లు ఒకటే పాషన్ తో గొప్ప చరిత్రతతో జరుగుతుంటాయి. మనం ఆడకపోవడమనేది సిగ్గుపడే చర్య. దాంతో పాటు పాకిస్తానీ ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. 

వారికి ఇండియన్ క్రికెటర్లంటే గౌరవం. ఇండియాలో ఆడినప్పుడు నా పాకిస్తాన్ సహచరులంతా లవ్, సపోర్ట్ ఇస్తుంటారు. మళ్లీ అలా మ్యాచ్ లు జరగాలని కోరుకుంటున్నా’ అని మాలిక్ అన్నాడు. 

Read: WWE : Undertaker రిటైర్ మెంట్!

Related Posts