లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రాత్రంతా చితక్కొట్టారు… తెల్లారి అల్లుడ్ని చేసుకున్నారు

Published

on

lover’s family beats boy : ప్రేయసిని చూడటానికి ఇంటికి వెళ్లిన ప్రియుడ్ని ప్రియురాలి కుటుంబ సభ్యులు రాత్రంతా చితక్కొట్టారు. తెల్లారిన తర్వాత పోలీసు స్టేషన్ లో అప్పచెప్పారు. అక్కడ పంచాయతీ జరిగి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంటి అల్లుడ్ని చేసుకున్నారు.

ఏదైతే ఏం…… చితక్కొట్టి ఒళ్లు హూనం చేసినా, చివరికి ఇంటి అల్లుడ్ని చేసుకున్నారు. ప్రియురాలితో ప్రియుడి పెళ్లి జరిగి సంతోషంగా ఉన్నారు. ఈఘటన ఉత్తరప్రదేశ్, రామ్ పూర్ జిల్లా అజిమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మెహందీ నగర్ సుమాలీ గ్రామంలో జరిగింది.గ్రామంలో నివసించే లక్ష్మీ అనే యువతి, స్వార్ ప్రాంతానికి చెందిన గడ్డి నాగ్లి గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ తరచూ బయట కలుసు కుంటూ ఉండేవారు. ఈ క్రమంలో ప్రేమ్ సింగ్ తన ప్రియురాలిని కలవటానికి నవంబర్ 21వ తేదీ రాత్రి గ్రామానికి వచ్చాడు.

తింటున్నాడు..తాగుతున్నాడు గానీ 18 నెలలుగా టాయిలెట్‌కు వెళ్లట్లేదు..! ఇదేం రోగంరా నాయనా..!!


అప్పటికి బాగా పొద్దు పోయేసరికి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియురాలి గదిలోకి వెళ్లాడు. తమ ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చాడని భావించిన ఇంట్లోని వారు అలర్టై అతడ్ని గదిలో బంధించారు. తాను ఎందుకు వచ్చానని వారికి వివరించి చెప్పేలోపే కుటుంబ సభ్యులు అతడ్ని కొట్టటం ప్రారంభించారు.


కుటుంబ సభ్యులతో పాటు ఊళ్లోని వారు వచ్చి అతడ్ని కొట్టారు. కొంత సేపటికి కొట్టటం ఆపి ప్రేమ్ సింగ్ ను గదిలోనే బంధించారు. మరునాడు ఉదయం సమీపంలోని పోలీసు స్టేషన్ లో అప్పగించారు. పోలీసు విచారణలో తన ప్రేయసిని కలవటానికి వెళ్లినట్లు చెప్పాడు. పోలీసులు ప్రేమ్ సింగ్ తల్లితండ్రులను పిలిపించారు.

ఇరు కుటుంబాలను కూర్చోపెట్టి మాట్లాడారు. ఇద్దరూ ప్రేమించు కుంటున్న విషయం పెద్దలకు తెలిసి పోయింది. ఇంకేముంది అబ్బాయిని తమ ఇంటి అల్లుడ్ని చేసుకోటానికి అమ్మాయి తరుఫువారు అంగీకరించారు. గతరాత్రి జరిగిన ఘటన మర్చిపోయి అబ్బాయి అమ్మాయి మెడలో మూడు ముళ్లువేశాడు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *