లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

దిగొచ్చిన కరోనా కిట్ల ధరలు.. ఒక్కో కిట్ ఎంతంటే?

Published

on

low-cost COVID-19 test kit prices : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలకు వినియోగించే కిట్ల ధరలు కూడా తగ్గాయి.. ఒక ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.1000 ఉండగా. ఇప్పుడు రూ.55ల ధరకు దిగొచ్చింది.కోవిడ్‌ వచ్చిన కొత్తల్లో కిట్‌లు, ఇతర కొనుగోళ్లకు రాష్ట్రాలు చాలావరకు ఆర్థికంగా నష్టపోయాయి. ఏపీలో రోజూ కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ.5 కోట్లు పైనే ఖర్చు అయ్యేది.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు


ఒకరికి కరోనా పరీక్ష చేయాలంటే రూ.4 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది.. ఏపీ సర్కారు టెండర్లలో కేవలం రూ.55కు ధరకే కిట్లు వచ్చేచాయి. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడంతో ఎప్పటికప్పుడు టెండర్లకు వెళ్లడం కలిసొచ్చింది.ఎక్కడా రాష్ట్రంలో చేయని విధంగా తరచూ టెండర్లకు వెళ్లడం వల్లే 80 నుంచి 90 శాతం కరోనా కిట్ల ధరలు తగ్గినట్టు కనిపిస్తోంది. ఆర్టీపీసీఆర్‌ కిట్‌ను రూ.350తో కొనుగోలు చేస్తున్నారు.

కొత్త టెండర్లలో ఒక్కో కిట్ ధర కేవలం రూ.55 పలికింది. దేశ వ్యాప్తంగా పీపీఈ కిట్‌ల నుంచి, ఆర్టీపీసీఆర్‌ కిట్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. సాధారణ సర్జికల్‌ మాస్క్‌ను రూ.13 నుంచి రూ.16 వరకు పెట్టి కొనాల్సి వచ్చేది.ప్రస్తుతం రూ.2.50కి పడిపోయింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధరను ప్రభుత్వం రూ.1,900 నుంచి రూ.1,000కి తగ్గించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *