SBI పండుగ ఆఫర్లు.. పర్సనల్, హోం లోన్లు, తక్కువ వడ్డీకే కార్ల లోన్లు.. 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SBI festive offers : Lowest interest rates on car, personal loans : ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ రిటైల్ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకించి కార్ల లోన్లు, పర్సనల్ లోన్లు, హోం లోన్లను అందిస్తోంది. కార్ల లోన్లపై తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. YONO యాప్ ద్వారా కారు లోన్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు అప్లయ్ చేసే రిటైల్ కస్టమర్లందరి కోసం 100 శాతం ప్రాసిసింగ్ ఫీజు కూడా ఎత్తేసింది. ప్రారంభ వడ్డీ 7.5 శాతం నుంచి ఎస్బీఐ తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన కారు మోడల్స్ పై 100 శాతం రోడ్ ఫైనాన్స్ కూడా అందిస్తోంది.



హోం లోన్లపై కూడా ఎస్బీఐ స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసేవారికి అప్రూవ్ చేసిన హోం లోన్లపై పూర్తిగా ప్రాసిసెంగ్ ఫీజును ఎత్తేస్తున్నట్టు తెలిపింది. లోన్ మొత్తంతో పాటు కస్టమర్ల క్రెడిట్ స్కోరు ఆధారంగా వడ్డీ రేటుపై 10bps (బేసిస్ పాయింట్లు) వరకు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. YONO యాప్ ద్వారా అప్లయ్ చేస్తే.. అదనంగా హోం బయర్లకు 5bps (బేసిస్ పాయింట్లు) వడ్డీ రాయితీ కూడా అందిస్తోంది.. YONO (YOU ONLY NEED ONE APP) యాప్ ద్వారా హోం లోన్ అప్లయ్ చేసేవారంతా లోన్ మొత్తంపై వడ్డీ రాయితీని పొందవచ్చు.



ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో గోల్డ్ లోన్ కస్టమర్లకు మంచి తరుణమే.. 7.5 శాతం తక్కువ వడ్డీతో 36 నెలల వరకు రీపేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్లపై కూడా ఎస్బీఐ 9.6 శాతంతో ఆఫర్ చేస్తోంది. YONO యాప్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే SBI కస్టమర్లు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేకుండానే ప్రీ-అప్రూవడ్ పర్సనల్ లోన్లు పొందొచ్చు.



YONO యాప్ లో మీరు పర్సనల్ లోనుకు అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.. PAPL <space> <last 4 digits of SBI A/C no> to 567676 నెంబరుకు రిజిస్టర్డ్ మొబైల్ నుంచి SMS చేయాల్సి ఉంటుంది.

Related Posts