lpg cylinder price november 1st 2019 rate hike per cylinder rs.76 rupes

భారీ షాక్ : రూ.76 పెరిగిన గ్యాస్ ధర

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఏకంగా రూ.76 లు పెరిగింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు శుక్రవారం (నవంబర్ 1,219) నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం.. ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.681.50గా ఉంది.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.706, ముంబైలో రూ.651, చెన్నైలో రూ.696గా ఉంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తారీఖున మారుతూ ఉంటుంది. సిలిండర్ ధర పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చు.

సిలిండర్ ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం. అక్టోబర్ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్ నెలలోనూ ఎల్‌పీజీ ధర రూ.15.5 పైకి పెరిగింది. ఈ నెలో మాత్రం సిలిండర్ ధర భారీగా పెరిగింది.

Related Posts