మరోసారి చిరు సినిమాకు నో చెప్పిన వివేక్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ ఫేమ్ సుజిత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ విలన్ పాత్రల్లో రాణిస్తున్న నటుడు వివేక్ ఒబేరాయ్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటించేందుకు నిరాకరించాడట.

Lucifer- Telugu Remake

మాతృకలో విలన్ పాత్రలో కనిపించిన వివేక్‌నే తెలుగులోకి కూడా తీసుకోవాలని చిత్రబృందం భావించిందట. వివేక్‌తో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే మరోసారి అదే పాత్రలో కనిపించేందుకు వివేక్ నిరాకరించాడని సమాచారం. దీంతో ఆ పాత్రకు నటుడు రెహమాన్‌ను తీసుకున్నారట. గతంలో మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’లో విలన్ పాత్రను కూడా వివేక్ తిరస్కరించాడు.

Lucifer

ఈ చిత్రంలో చిరు సోదరి పాత్రలో ఓ సీనియర్ నటి కనిపించనున్నారని, బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతమందించనున్నారని తెలుస్తోంది. చిరు, కొరటాల కాంబోలో రూపొందుతున్న ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ కానుంది.

Related Posts