లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెగా రీమేక్.. ‘లూసిఫర్’ డైరెక్ట్ చేసేది రాజానే..

Published

on

Lucifer Telugu Remake: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 152వ సినిమా ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’, మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు.

త్రివిక్రమ్, హరీష్ శంకర్, మెహర్ రమేష్, బాబీ వంటి దర్శకులు మెగాస్టార్‌తో సినిమాలు చేయడానికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ‘వేదాళం’ రీమేక్ బాధ్యతలు మెహర్‌కి అప్పగించారు. అయితే చిరు ‘ఆచార్య’ తర్వాత ముందుగా ఏ రీమేక్ చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

తాజాగా క్లారిటీ వచ్చేసింది. చిరు 153వ సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కనుంది. ముందుగా చిరుతో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెం:150’ వంటి రీమేక్స్ చేసి సూపర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌ను దర్శకుడిగా అనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల కుదర్లేదు. కట్ చేస్తే ‘జయం’ రాజాను డైరెక్టర్‌గా ఫిక్స్ చేశారు.

Jayam Raja

ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ పెద్ద కొడుకే రాజా.. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ తో దర్శకుడిగా పరిచయమైన రాజా.. ‘జయం’ తమిళ్ రీమేక్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతోనే తమ్ముడు ‘జయం’ రవి హీరోగా పరిచయమయ్యారు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సూపర్ హిట్ సినిమాలు రీమేక్ చేశారు.

తొలిసారి సొంత కథతో ‘తనిఒరువన్’ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ గా రీమేక్ చేస్తే సూపర్ హిట్ అయింది. ‘లూసిఫర్’ రీమేక్‌కి రాజా అయితే బాగుంటుందని ఆయణ్ణి సంప్రదిచంగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎన్‌ఆర్‌వి సినిమాస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 సంక్రాంతి తర్వాత చిరు షూటింగులో పాల్గొంటారు.