Home » తమ్ముడు స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేడు…అళగిరి
Published
2 months agoon
M K Stalin will never become CM మరికొన్ని నెలల్లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోదరుడు, పార్టీ బహిష్కృ త నేత ఎంకే అళగిరి జోస్యం చెప్పారు. తాను కొత్త పార్టీ స్థాపించే విషయంపై అతి త్వరలో అధికారిక ప్రకటన చేస్తానని అన్నారు. తాను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, దానికి సిద్ధంగా ఉండాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
మదురైలో తన మద్దతుదారులు, అనుచరులతో ఆదివారం సమావేశమైన అళగిరి మాట్లాడుతూ… డీఎంకే కోశాధికారిగా ఉండాలని స్టాలిన్ కు సూచించాను. కానీ నేను దక్షిణ తమిళనాడు డీఎంకే సెక్రెటరీ అయినందుకు స్టాలిన్ అసూయ చెందారు. కరుణానిధి తర్వాత పార్టీ మొత్తం బాధ్యతలు చూసుకోవాలని స్టాలిన్ కు చెప్పాను. కానీ నాకు ఇలా ద్రోహం చేస్తారని అర్థం చేసుకోలేకపోయా. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ ను డిప్యూటీ సీఎం చేయాలని కరుణానిధి కోరారు. అందుకు నేను అంగీకరించా. కరుణానిధి లాంటి నేత మరొకరు ఉండరు. ప్రస్తుత డీఎంకే ఆయనను మర్చిపోయింది. స్టాలినే భవిష్యత్తులో తమిళనాడు సీఎం అని పోస్టర్లు కన్పిస్తున్నాయి. కానీ అది ఎప్పటికీ జరగదు. నా అనుచరులు స్టాలిన్ ను ఎప్పటికీ సీఎం కానివ్వరు. కొత్త పార్టీ పెట్టమని ఎంతోమంది నాకు సూచనలు ఇచ్చారు. దీనిపై త్వరలోనే స్పష్టతనిస్తానని అళగిరి తెలిపారు.
తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, తండ్రి, దివంగత డీఎంకే చీఫ్ కరుణానిధి బలవంతంతోనే బాధ్యతలు నిర్వహించానని అన్నారు. తన నాయకత్వంలోనే 2009 తిరుమంగళం ఉప-ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఉప-ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి 40వేల ఓట్లతో విజయం సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో మీడియా, కొంత మంది వ్యక్తుల ద్వారా ఓటర్లకు డీఎంకే డబ్బు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ, అళగిరి మాత్రం డీఎంకే విజయానికి హార్డ్ వర్క్ కారణమని తెలిపారు.
కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి.. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే, అన్నదమ్ముల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే అళగిరిని బహిష్కరించారు. ఇదిలా ఉండగా.. అళగిరి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే సోదరుడు స్టాలిన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్
స్టైల్, రూట్ మార్చిన రాహుల్
ఈ ఏడాది కూడా 9,10,11వ తరగతి పరీక్షలు రద్దు
శశికళ ఆసక్తికర వ్యాఖ్యలు..100 ఏళ్లు అన్నాడీఎంకే అధికారంలో ఉండాలి
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం
అసభ్యకర వీడియోతో సినీ నటిని బెదిరిస్తున్న కాలేజీ యజమాని