లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

మా లో మరో కొత్త వివాదం : నరేశ్‌, జీవితా రాజశేఖర్‌ మధ్య పెరిగిన దూరం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వివాదం నెలకొంది. మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌ మధ్య దూరం పెరిగింది. మా జనరల్‌ బాడీ మీటింగ్‌ ఉందని సభ్యులకు జీవితా రాజశేఖర్‌

Published

on

maa new controversy

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వివాదం నెలకొంది. మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌ మధ్య దూరం పెరిగింది. మా జనరల్‌ బాడీ మీటింగ్‌ ఉందని సభ్యులకు జీవితా రాజశేఖర్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో వివాదం నెలకొంది. మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌ మధ్య దూరం పెరిగింది. మా జనరల్‌ బాడీ మీటింగ్‌ ఉందని సభ్యులకు జీవితా రాజశేఖర్‌ మెసేజ్‌ పంపారు. ప్రెసిడెంట్‌ నరేశ్‌ అనుమతి లేకుండా మీటింగ్‌ ఎలా పెడతారంటూ మాణిక్‌, కుమారస్వామి కోర్టుకెక్కారు. సభ్యుల అనుమతి లేకుండా జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టుకోవద్దని కోర్టు చెప్పిందని మాణిక్‌, కుమారస్వామి చెబుతున్నారు. 

దీనిపై జీవితా వివరణ ఇచ్చారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని సమాధానం ఇచ్చారు. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని స్పష్టం చేశారు. మా అధ్యక్షుడిగా నరేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జీవితా సెక్రటరీగా ఉన్నారు. గత మూడు నెలలుగా వీరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. రాజశేఖర్ తనకు అనుకూలంగా ఉన్న 21మందితో కలిసి నరేష్‌కు నోటీసులు అందించినట్లుగా తెలుస్తోంది. గత 9 నెలలుగా మా లో ఏం జరుగుతుంది? ఎంత ఫండింగ్ అందింది? ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి? అన్న దానిపై జీవితా రాజశేఖర్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఘటనతో నరేష్, జీవితా రాజశేఖర్ మధ్య దూరం మరింత పెరిగింది.

నరేష్ పనితీరుపై జీవితా రాజశేఖర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నరేష్ పని తీరుపై చర్చించి, సమస్యలు పరిష్కరించుకుందామంటూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ మెంబర్లకు జీవితా రాజశేఖర్ దంపతులు మెసేజ్ పెట్టారు. ఇది వివాదానికి దారి తీసింది. అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా పెడతారు అంటూ నరేష్ తరపు లాయర్ రాజశేఖర్‌ను ప్రశ్నించారు. సమావేశంలో నరేష్ 9 నెలల్లో చేసిన పనులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 5.5 కోట్లనే నరేష్ ఖర్చు చేస్తున్నారని, మూలధనంలో రూపాయి కూడా జమ చేయలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *