యూత్‌కి కనెక్ట్ అయ్యే ‘మా వింత గాధ వినుమా’!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Maa Vintha Gaadha Vinuma: కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్, మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పాపులర్ ఓటీటీ ఆహా అందిస్తున్న సరికొత్త సినిమా.. ‘మా వింత గాధ వినుమా’.. ఇటీవల ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ, శీరత్ కపూర్ మెయిన్ లీడ్స్‌గా ఆదిత్య మందల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా వింత గాధ వినుమా’ టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.


సిద్ధు రైటింగ్‌తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించడం విశేషం. కాలేజ్, లవ్, బ్రేకప్.. ఇలా రియాలిటీకి దగ్గరగా యూత్‌ని బేస్ చేసుకుని రాసుకున్న ఈ కథ కచ్చితంగా ఆకట్టుకుంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.


లక్ష్మీ మంచు, తనికెళ్ల భరణి, కమల్ కామరాజు, ప్రగతి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రోహిత్ – జోయ్ సంగీతం, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటొగ్రఫీ అందించారు. నవంబర్ 13న ఆహాలో ‘మా వింత గాధ వినుమా’ వరల్డ్ ప్రీమియర్ కానుంది.

Related Tags :

Related Posts :