Home » మదనపల్లి: చెల్లెల్ని అక్కే చంపేసిందా.. నిమ్మకాయ తొక్కడమే హత్యలకు కారణమా
Published
1 month agoon
Madanapalle: మదనపల్లి జంట హత్యకేసు మిస్టరీ చుక్కలు చూపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న కేసు కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు. ప్రధాన నిందితుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో చేధించడం కష్టంగా మారింది. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు మానసిక పరిస్థితి బాగాలేకపోవడమే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.
లెక్కల్లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన పద్మజ.. మానసిక పరిస్థితి గురించి అంతుచిక్కడం లేదు. మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వింత ప్రవర్తనతో అక్కడ ఉన్నవారందరినీ భయానికి గురి చేశారు. అరెస్టు చేసే ముందు కరోనా పరీక్షలు చేసేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా పరీక్ష చేసుకోవడానికి నిరాకరించారు.
అర్థం చేసుకోలేని పిచ్చి తల్లి:
‘ఎవరూ మాస్కులు వేసుకోవద్దు. శివ (నా) శరీరంలో నుంచే కరోనా పుట్టింది. కలి సంహారం చేసేప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా.. అది దులపడానికే కరోనా వైరస్‌ను బాడీపార్ట్స్ నుంచి పంపించాను. చైనా నుంచి రాలేదు. గొంతులో హలాహలాం ఉంది. నాకు కరోనా పరీక్షలు అవసరం లేదు. మీరు దేవుడికే పరీక్షలు జరుపుతారా..? శ్యాంపిల్ ఇవ్వను. మీరెవ్వరు.. నాకు చెప్పడానికి. నేను శివ. మార్చిలోపు వ్యాక్సినేషన్ లేకుండా కరోనా అంతమవుతుంది. అన్ని ఫార్మసూటికల్స్ కంపెనీలు మూసుకోవాలి’. అని ఆస్పత్రిలో హడావుడి చేసింది. పోలీసులు ఇంటి నుంచి తీసుకువచ్చేటప్పుడు అవంతిక గుడికి వెళుతున్నానంటూ చేతులు తిప్పుతూ ఎవ్వరికో చెప్పినట్లుగా మాట్లాడింది.
పురుషోత్తంనాయుడు మదనపల్లెలో పేరుమోసిన ప్రొఫెసర్. సైన్స్‌పై ప్రేమ ఎక్కువ. పిల్లలను అపురూపంగా చూసేవాడు. భార్య ప్రవర్తనతో మానసిక వేదనకు లోనయ్యాడు.
చేతులారా చంపేసుకున్నాం:
‘మా కుటుంబానికి దరిద్రం పట్టింది. చేతులారా బంగారు తల్లులను చంపేసుకున్నాం. సారీ డాడీ! అంటూ శ్మశానంలో రోదించడం అందరినీ కలచివేసింది. ఆస్పత్రిలో, పోలీసుల అదుపులో గుంభనంగా ఉంటూ, భార్యచేసే పిచ్చిచేష్టలను భరిస్తూ తనను సముదాయించేందుకు ప్రయత్నిస్తే.. నీవు నా భర్తవు కావు. నేను శివైక్యంలో ఉండగా నన్ను కంట్రోల్ చేయొద్దని చెప్పానా..? అని అరిస్తే మారుమాట్లాడకుండా ఆమెను అనుసరించారు.
పురుషోత్తంనాయుడు కుటుంబాన్ని స్వహస్తాలతో నాశనం చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. వారం క్రితం చిన్నమ్మాయి సాయిదివ్య కుక్కను తీసుకుని వాకింగ్ వెళ్తుండగా దారిలో ఎవరో మంత్రించి పడేసిన నిమ్మకాయను తొక్కింది. అప్పటి నుంచి తనకేదో కీడు జరుగుతోందని, తనకు తెలియకుండానే కొన్ని శక్తులు ఆవహించాయని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. దీన్ని గమనించిన పెద్దమ్మాయి అలేఖ్య తనకున్న శక్తులతో దుష్టశక్తిని పారద్రోలుతానని తల్లిదండ్రులను నమ్మించింది.
చెల్లెల్ని బాగుచేస్తానని చెప్పి:
‘అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు.. నేను శివ స్వరూపురాలిని, కాళికా దేవి నన్ను ఆవహించింది. చెల్లెలి శరీరంలోని కలి (దుష్టశక్తి)ని నాశనం చేస్తాను.’ అని నమ్మబలికింది. కుమార్తె మాటలు నమ్మి ఆమె చెప్పినట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాతే హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కుప్పంకు జూ.ఎన్టీఆర్ రావాలన్న ఫ్యాన్స్..తల ఊపిన బాబు
చిత్తూరు జిల్లాలో అమానుషం : దళిత మహిళ మృతదేహాన్ని తమ వీధిగుండా తీసుకెళ్లకుండా అడ్డుకున్న భూస్వాములు
చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్
ఎస్ఈసీ నిమ్మగడ్డ చిత్తూరు జిల్లా పర్యటనపై పోలీసుల్లో టెన్షన్
ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత అనుమానాస్పద మృతి..రైల్వేట్రాక్ పై మృతదేహం
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు మృతి