తాగొచ్చి తల్లిని హింసిస్తున్న తండ్రిని బ్యాట్ తో కొట్టి చంపిన కూతురు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Madhya pradesh 16 girl killed her father : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ అమ్మాయి తండ్రిని కొట్టగా బలమైన గాయాలు కావటంతో మరణించాడు. మద్యానికి బానిసైన తండ్రి ప్రతీరోజు తాగి వచ్చి తల్లిని ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నాడు. తాను అడ్డువెళ్లినా పక్కకు గెంటేసి తల్లిని హింసిస్తుంటే చూసి తట్టుకోలేని 16 ఏళ్ల బాలిక తండ్రిని అడ్డుకుంది. కానీ మద్యం మైకంలో ఉన్న తండ్రి అదేమి పట్టించుకోకుండ పదే పదే తల్లిని కొడుతుంటే..దెబ్బలు తాళలేక తల్లి ఏడుస్తూంటే చూసి ఆవేశంతో తండ్రిని వాషింగ్ బ్యాట్ తో కొట్టింది. దీంతో అతను అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.


నిత్యం తాగి రావడమే కాకుండా, తల్లిని దూషిస్తూ, ఆమెను విచక్షణ రహితంగా కొడుతుండడంతో తట్టుకోని ఆ అమ్మాయి చేతికందిన కర్ర తీసుకుని తండ్రి అని కూడా చూడకుండా కొట్టింది. ఆ గాయాల తీవ్రతకు అతగాడు అక్కడికక్కడే మరణించాడు. ఆపై ఆ అమ్మాయి 100 నెంబర్ కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.


కొడుకు మేస్త్రీ పని ద్వారా సంపాదిస్తుంటే 45 ఏళ్ల తండ్రి పనీపాటా లేకుండా తిరుగుతూ తాగటమే పనిగా పెట్టుకున్నాడు. ప్రతీరోజు తాగి వచ్చి భార్యను కొట్టటం..కూతుర్ని తిట్టటం చేస్తుండేవాడు. నానా యాగీ చేసేవాడు. నోటికొచ్చినట్లుల్లా బూతులు తిట్టటంతో ఇల్లంతా నరకంలా తయారైంది.


వికలాంగ బాలికను తల్లిని చేసిన నీచుడు….అరెస్ట్


ఈ క్రమంలో బుధవారం ( ‘అక్టోబర్ 21,2020) కొడుకు పెళ్లి చేయాలని ఇంటిలో మాట్లాడుకుంటుండగా సాయంత్రం 6.30గంటలకు ప్రతీరోజులాగనే తాగి ఇంటికొచ్చాడు.వచ్చీ రావటంతోనే భార్యను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. అది చూసిన 16ఏళ్ల కూతురు అడ్డుకుంది. దీంతోమరింతగా రెచ్చిపోయి తల్లీకూతుళ్లను బూతులు తిట్టటం మొదలుపెట్టాడు.


దురుసుగా భార్యను మరోసారి కొట్టాడు..దెబ్బలు తాళలేక తల్లి ఏడుస్తూ చూసిన కూతురు తండ్రిపై ఆగ్రహంతో రగిలిపోయింది. అక్కడే బ్యాట్ తో కొట్టింది. తలపై బలమైన దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిన అతను మృతి చెందాడు.


ఆ తరువాత తాను చేసిన పని తెలుసుకున్న ఆమె తాను స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తానే తండ్రిని కొట్టానని ఆ దెబ్బలకు అతను చనిపోయాడని చెప్పింది. వెంటనే వచ్చిన పోలీసులు బాలికపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకుని బాలనేరస్తుల సదనానికి తరలించారు.అనంతరం శిశు సంక్షేమ కమిటీకి తరలించి కౌన్సెలింగ్ ఇస్తామని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు కెకె వర్మ తెలిపారు.

Related Tags :

Related Posts :