Home » అడవిలో అరాచకం : 13 ఏళ్ల బాలికపై ఐదురోజులు..తొమ్మిదిమంది అత్యాచారం
Published
1 month agoon
Madhya Pradesh 13 Year Old girl Raped : మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలోని అటవిలో 13 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా..అనాగరికంగా అత్యాచారానికి పాల్పడ్డారు తొమ్మిదిమంది మృగాళ్లు. ఐదురోజుల పాటు లెక్కలేనన్ని సార్లు అత్యాచారం కొనసాగించిన ఘోర ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ‘సమ్మాన్’ ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఈ అత్యంత దారుణ ఘటన జరగడం గమనించాల్సిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై నేరాల గురించి 15 రోజుల పాటు ప్రజల్లో అవగాహన కల్పించే ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళలపై గత ఆరు రోజుల్లో ఇటువంటి ఘోర ఘటనలు జరగటం వారి భద్రతపై ప్రశ్నార్థకంగా మారాయి.
జనవరి 4న 13 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ యువకుడు ఆ బాలికకు తెలిసిన వ్యక్తే కావటంతో పాపం అతన్ని పూర్తిగా నమ్మి వెంటే వెళ్లింది. అలా ఆ బాలికను నమ్మించి తీసుకెళ్లిన ఆ యువకుడు అక్కడికి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అనంతరం అతనితో పాటు ఆరుగురు స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అలా ఈ నెల 5న బాలికను వదిలిపెట్టాడు.
వదిలిపెట్టేముందు ఈ విషయం ఎవరికన్నా చెబితే ..నీతో పాటు నీ కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తానని..బెదిరించాడు. దీంతో అప్పటికే తనమీద జరిగిన దారుణం నుంచి కోలుకోలేని ఆ పసిప్రాణం భయంతో నోరువిప్పలేదు. ఆ తరువాత ఆరు రోజుల తర్వాత 11న మళ్లీ ఆ బాలికను అత్యాచారం చేసివారిలో ఒకడు మళ్లీ కిడ్నాప్ చేసి..మరోసారి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మరో ముగ్గురితో కలిసి ఘాతుకానికి పాల్పడ్డారు.
బాలికను వదిలిపెట్టిన అనంతరం.. మరో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక శుక్రవారం (జనవరి 15,2021) తెల్లవారు జామున పారిపోయి ఇంటికి చేరింది. అలా పదే పదిసార్లు అత్యాచారం జరిగేసరికి ఆ బాధ భరించలేక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని..మిగతా వారిని పట్టుకుంటామని చెప్పారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి అరవింద్ తివారి చెప్పారు.
ఢిల్లీ వెళ్లే వారికి ముఖ్య గమనిక, ప్రభుత్వం కొత్త నిబంధన
మధ్యప్రదేశ్‌లో దారుణం : యువతికి మద్యం తాగించి రెండు రోజులు గ్యాంగ్ రేప్..నిందితుల్లో ఒకరు బీజేపీ నేత
మండుతున్న ఇంధన ధరలు : మధ్యప్రదేశ్‌లోనూ పెట్రోల్ రూ.100 దాటేసింది!
ఘోర బస్సు ప్రమాదం, 38మంది జలసమాధి
భర్త నుంచి విడిపోయి వేరొకరితో సహజీవనం చేస్తోందని మహిళకు దారుణ శిక్ష విధించిన గ్రామస్తులు
హెలికాఫ్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి..రాష్ట్రపతికి మహిళా రైతు లేఖ